Sova Trojan: కొత్త మాల్వేర్ గురించి హెచ్చరిస్తున్న SBI బ్యాంక్

HIGHLIGHTS

కొత్త Sova Trojan మాల్వేర్ గురించి హెచ్చరిస్తున్న SBI మరియు PNB బ్యాంకులు

ప్రజలను మభ్యపెట్టేందుకు హ్యాకర్లు కొత్త కొత్త మార్గాలను ఉపయోగిస్తన్నారు

అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ SBI ఈ వైరస్ గురించి జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది

Sova Trojan: కొత్త మాల్వేర్ గురించి హెచ్చరిస్తున్న SBI బ్యాంక్

Sova Trojan: కొత్త మాల్వేర్ గురించి హెచ్చరిస్తున్న SBI మరియు PNB బ్యాంకులు. ఎందుకంటే, ప్రజలను మభ్యపెట్టేందుకు హ్యాకర్లు కొత్త కొత్త మార్గాలను ఉపయోగిస్తన్నారు. ఇప్పుడు అదే దారిలో కొత్త Sova Trojan వైరస్ వెల్లువెత్తింది మరియు దీని గురించి దేశంలోని ప్రధాన బ్యాంక్ లైన SBI మరియు PNB లు తమ వినియోగదారులకు అవగాహన కల్పించడం ప్రారంభించాయి. కేవలం ఈ రెదను బ్యాంక్ లు మాత్రమే కాదు చాలా బ్యాంక్ లు కూడా ఈ సోవా ట్రోజన్ వైరస్ నుండి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ SBI ఈ వైరస్ గురించి జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ' మాల్వేర్ లు మీ విలువైన డేటాని దొంగిలించకుండా చూసుకోండి. దీని కోసం, మీరు ఎల్లప్పుడూ విశ్వసనీయ మూలాల నుండి వచ్చిన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేయండి' అని చెబుతోంది.

 

 

అందుకే, Sova Trojan వైరస్ అంటే ఏమిటీ, ఇది ఎలా పనిచేస్తుంది మరియు దీనిని ఎలా నివారించాలి అనే విషయాలను మీరు తెలుసుకోవడం మంచిది. SBI 9 ప్రకారం, SOVA అనేది Android-ఆధారిత ట్రోజన్ మాల్వేర్, ఇది పర్సనల్ డేటాను దొంగిలించడానికి నకిలీ బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించే వారిని టార్గెట్ చేస్తుంది. ఈ మాల్వేర్ వినియోగదారుల విలువైన డేటా మరియు సమాచారాన్ని దొంగిలిస్తుంది.

ఇక్కసారి ఇన్‌స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు

net-banking Apps ద్వారా వినియోదారులు వారి అకౌంట్ లను లాగిన్ చేసినప్పుడు ఈ మాల్వేర్ యూజర్ల సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. మీ ఫోన్‌లో ఈ మాల్వేర్ కలిగిన యాప్స్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌ను తీసివేయడానికి మార్గం ఉండదు.

మరి ఏమి చెయ్యాలి?

ఈ మాల్వేర్ ను మీ ఫోన్ లో ఇక్కసారి ఇన్‌స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు, ఇక దాన్ని తీసివెయ్యడం కష్టం. కానీ, దీన్ని నివారించడానికి ఒకేఒక్క మార్గం వుంది. మీకు తెలియని లేదా గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే Links పైన ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చెయ్యవద్దు. మీకు కావాల్సిన యాప్స్ ను డౌన్‌లోడ్ చేయడానికి ఎల్లప్పుడూ విశ్వసనీయమైన యాప్ స్టోర్‌ మాత్రమే ఉపయోగించండి.

ముఖ్యంగా, ఒక యాప్ డౌన్‌లోడ్ ముందుగా ఆ యాప్ యొక్క రివ్యూలను చెక్ చెయ్యండి. అలాగే, యాప్స్ కు అనుమతులను ఇచ్చేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాదు, మీ ఫోన్ లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo