2019 ప్రథమార్ధంలో మార్కెట్లోకి రానున్నట్లు అంచావేస్తున్న స్మార్ట్ ఫోన్లు :హానర్ వ్యూ20 ప్రో,షావోమి రెడ్మి ప్రో 2 మరియు మరికొన్ని ఫోన్లు

2019 ప్రథమార్ధంలో మార్కెట్లోకి రానున్నట్లు అంచావేస్తున్న స్మార్ట్ ఫోన్లు :హానర్ వ్యూ20 ప్రో,షావోమి రెడ్మి ప్రో 2 మరియు మరికొన్ని ఫోన్లు
HIGHLIGHTS

జనవరి 2019, నెలలో చాల రకాలైన ఫోన్లు మార్కెట్లోకి రానున్నట్లు విశ్వసనీయ మరియు రూమర్ల ద్వారా తెలుస్తోంది. వాటిలో హానర్ వ్యూ20, లెనోవో Z5 ప్రో GT వంటివి చాలనే ఉన్నాయి

2018 సంవత్సరం భారతదేశంలో మధ్యస్థాయి, ప్రధాన మరియు బడ్జెట్ ఫోనులు చాలావరకూ విడుదలచేయబడ్డాయి. స్మార్ట్ ఫోన్ల  పైన మక్కువచూపేవారికి ఇది ఒక గొప్ప సంవత్సరం, చాలవరకూ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లలో  కొన్ని ప్రధాన అప్డేట్లను చేశాయి. మధ్య శ్రేణి సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్లలో మరియు బడ్జెట్ సెగ్మెంట్ పరికరాలలో, శక్తివంతమైన హార్డ్వేర్లను మరియు  ప్రీమియం లక్షణాలను మనము చూశాము. నోచ్ డిస్ప్లే మరియు డ్యూయల్ / ట్రిపుల్ రియర్ కెమెరాలు వంటివి మార్కెట్లో ఇపుడు దాదాపు రూ .10,000 క్రింద ఉన్నాయి. అయితే, 2019 సంవత్సరానికి గాను అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ప్రజలు ముందుగా ఎన్నడూ చూడని కొత్త ఫీచర్లతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి అన్ని కంపెనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అనేక స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే జనవరి 2019 లో ప్రారంభించనున్నట్లు  వాటి కంపెనీలు ధ్రువీకరించాయి, మరికొన్ని స్మార్ట్ఫోన్లు ఈ నెలలో కూడా  పుకార్లు వచ్చిన పుకారు. జనవరి 2019 లో కనిపించనున్న కొన్ని స్మార్ట్ఫోన్లను పరిశీలించిచూద్దాం.

హానర్ వ్యూ 20

గత కొంతకాలంగా, హానర్ "వ్యూ 20" ను టీజింగ్ చేస్తున్నది మరియు ఇది వెనుక 48MP సెన్సార్నుమరియు రెండు ఇతర సెన్సార్లతో పాటుగా ప్రపంచ మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఉండనున్నట్లు చెబుతోంది. ఇది ముందుభగంలో, ఒక 25MP కెమెరా కోసం డిస్ప్లేలో ఒక పంచ్ హోల్  కలిగి ఉంటుంది మరియు ఒక 6.4-అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే తో రావచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్, హువాయ్ యొక్క సొంత Kirin 980 ఆక్టా కోర్ ప్రాసెసర్ ద్వారా ఆధారితంగా ఉండవచ్చని  భావిస్తున్నారు. బహుశా ఈ స్మార్ట్ఫోన్లో లభించే ఇతర ఫీచర్లుగా  TOF 3D  కెమెరా, 4000 ఎంహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుకావచ్చు.

హువావే నోవా 4

 ఇప్పటికే చైనాలో, Huawei Nova 4 డిసెంబర్ 2018 లో ప్రారంభించబడింది. ఇది డిస్ప్లేలో కెమరానికి కలిగిన మొదటి చైనీస్ ఫోన్, దీని డిస్ప్లేలో ముందు కెమెరా వస్తుంది. ముందువైపు 25MP సెన్సారుతో  ఈ ఫోన్ 48MP కెమెరాని కలిగి ఉంటుంది. ఈ పరికరం కిరిన్ 970 ప్రాసెసర్ చేత శక్తినిచ్చింది, ఇది 8GB RAM తో జతగా వస్తుంది. ఈ ఫోన్ చైనాలో 3,399 యువాన్ ధరతో ప్రారంభించబడింది.

లెనోవా Z5 ప్రో GT

జనవరి నెలలో Z5 ప్రో GT ప్రారంభించనున్నట్లు గత నెలలో లెనోవో ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ భారతదేశంలో విడుదల చేయబడుతుందా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు, కానీ ఇది త్వరలోనే ఇక్కడ కనిపిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్లు 12GB RAM తో వస్తాయి మరియు ఈ విభాగంలో ప్రపంచంలో మొదటి పరికరంగా ఉంటుంది. ఇది తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ చేత శక్తినిస్తుంది.

షావోమి రెడ్మి ప్రో 2

షావోమి సంస్థ, 2019 ప్రారంభంలో 48MP సెన్సారుతో ఒక ఫోన్ను ప్రారంభిస్తుందని వాగ్దానం చేసింది. ఈ విధమైన ఫీచరుతో,  సంస్థ టీజ్ చేస్తున్న ఫోన్ ఈ  Xiaomi Redmi Pro 2 గా ఉండవచ్చు. అయితే, ఇది నిజామో కాదో ఖచ్చితంగా తెలియదు? కానీ అదేగనుక నిజమైతే, అది జనవరిలో కనిపిస్తుంది.

నోకియా 9

HMD గ్లోబల్ యొక్క త్వరలో రాబోయే స్మార్ట్ ఫోన్ "నోకియా 9" వెనుక భాగంలో ఒక షడ్భుజి ఆకారంలోవుండే, ఒక పెంటా కెమెరా లెన్స్ సెటప్పుతో  ఈ ఫోన్ రానున్నది. ఇదే నిజమైతే, వెనుక ఆరు సెన్సర్లను కలిగిన ప్రపంచంలోని మొట్టమొదటి పరికరంగా  ఈ నోకియా 9 ఫోన్ ఉంటుంది. ప్రస్తుతం వస్తున్నా రూమర్ల ద్వారా, ఈ ఫోను యొక్క డిస్ప్లేలో వేలిముద్ర సెన్సార్ కూడా వుండే అవకాశం కనిపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo