మీ Gmail పాస్ వర్డ్ గుర్తులేదా..ఇలా ట్రై చేయండి.!

HIGHLIGHTS

గూగుల్ ఆధారిత అవసరాలకు Gmail అవసరమవుతుంది

మరి అంత ముఖ్యమైన మీ Gmail పాస్ వర్డ్ మర్చిపోతే

చాలా సింపుల్ తిరిగి పొందే మార్గాలున్నాయని గుర్తుంచుకోండి

మీ Gmail పాస్ వర్డ్ గుర్తులేదా..ఇలా ట్రై చేయండి.!

ప్రస్తుతం ఆన్లైన్ యుగంలో అన్ని గూగుల్ ఆధారిత అవసరాలకు కూడా Gmail అవసరమవుతుంది. Google యొక్క అన్ని ఇతర సర్వీస్ లను  ఉపయోగించేందుకు, మీకు Gmail ఖాతా దాదాపుగా అవసరం అవుతుంది. Android ఫోన్‌ వాడేవారికి ఖాతా తప్పనిసరి అవుతుంది. మరి అంత ముఖ్యమైన మీ Gmail పాస్ వర్డ్ మర్చిపోతే ఎలాగ? అంటే, మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది. ఒకవేళ మీరిప్పుడైనా మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే, చాలా సింపుల్ తిరిగి పొందే మార్గాలున్నాయని గుర్తుంచుకోండి.అందుకే, ఈ రోజు మనం జీమెయిల్ పాస్ వర్డ్ మరిచిపోతే ఎలా తిరిగి పొందాలో తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీరు మీ Gmail పాస్ ‌వర్డ్ ‌ను మరచిపోతే ఎలా ?

Step 1 – మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.

Step 2 – ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.

Step 3 – మీకు గుర్తుంకువున్న చివరి పాస్‌ వర్డ్ ‌ను నమోదు చేయండి. మీకు పాస్ ‌వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.

Step 4 – మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ‌కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

Step 5 – మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ ‌కు ఒక వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.

Step 6 – ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.

Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.

Step 8 – మీ పాస్వర్డ్ రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ ‌వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo