SBI అలర్ట్: ఈరోజు నుండి కొత్త రూల్స్

HIGHLIGHTS

ఈరోజు నుండి SBI కస్టమర్లకు కొత్త రూల్స్

కస్టమర్లకు కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్

కస్టమర్లకు కొత్త భారం పడనుంది

ఈరోజు నుండి ఈరోజు నుండి SBI కస్టమర్లకు కొత్త రూల్స్. ఇటీవల SBI తన బ్యాంక్ ఖాతాధారులకు కొత్త ఛార్జ్ లను విధించింది. అవేమిటంటే, SBI బ్యాంక్ లో అకౌంట్ వున్న కస్టమర్లకు కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను ప్రకటించింది. ఈ బేసిక్ సర్వీస్ ఛార్జ్ లతో కస్టమర్లకు కొత్త భారం పడనుంది. ఇప్పటి వరకూ వున్నా సర్వీస్ ఛార్జ్ లు కాకుండా జూలై 1 నుండి, అంటే ఈరోజు నుండి కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను వసూలు చేయనున్నట్లు SBI ప్రకటించింది.

ఏమిటా కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్?

SBI బ్యాంక్ ATM ట్రాన్సక్షన్స్ మొదలుకొని చెక్ బుక్ వరకూ కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను విదిస్తుంది. అంటే, SBI అకౌంట్ తో పాటుగా అందుకొనే ATM కార్డుతో 4 కంటే పైన చేసే నగదు విత్ డ్రా పైన 15 రూపాయలు+ GST ని వసూలు చేస్తుంది. అలాగే, జీరో అకౌంట్ కాకుండా సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి కూడా మినిమమ్ బ్యాలన్స్ మైన్ టైన్ చెయ్యకపోతే కూడా చార్జీలు చెల్లిచాలి.

ఇక చెక్ బుక్ చార్జీల విషయానికి వస్తే, ఇక సంవత్సరానికి గాను 10 చెక్ లీఫ్స్ తో కూడిన చెక్ బుక్ ను SBI ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ చెక్ బుక్ అయిపోయిన తరువాత కొత్త చెక్ బుక్ కావాలంటే మాత్రం కొత్త చెక్ బుక్ కోసం రూ.40 + GST చెల్లించాలి. ఇక 25 చెక్ లీఫ్స్ తో కనుక చెక్ బుక్ కావాలనుకుంటే రూ.75 + GST చెల్లించాలి. ఒకవేళ ఎమర్జెన్సీ చెక్ బుక్ మీకు అవసరమైతే దానికోసం రూ.50 + GST ని బ్యాంక్ కు చెల్లించాలని, SBI తన కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :