SBI అకౌంట్ ఉన్నవారికి అలర్ట్: ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే..డిలీట్ చేయండి..!

Updated on 12-Oct-2021
HIGHLIGHTS

SBI కొన్ని యాప్స్ వాడకం గురించి హెచ్చరించింది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్

ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీ

ప్రభుత్వ బ్యాంక్ SBI తన అకౌంట్ హోల్డర్లను చాలా కాలంగా కొన్ని యాప్స్ వాడకం గురించి హెచ్చరించింది. ముఖ్యంగా ,ఒక నాలుగు యాప్స్ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే, ఇప్పటికే ఈ నాలుగు యాప్స్ కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. అందుకే, SBI కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది. ఈ యాప్స్ ను Install చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారని సూచించింది.

విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూవర్ మరియు మింగిల్ వ్యూ యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది. అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది.

అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :