SBI అకౌంట్ వాడుతున్నారా..! అయితే, మీకోసమే ఈ అలర్ట్…!

HIGHLIGHTS

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అలర్ట్ జారీ చేసింది

SBI కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది

హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది

SBI అకౌంట్ వాడుతున్నారా..! అయితే, మీకోసమే ఈ అలర్ట్…!

ముందు నుండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అకౌంట్ హోల్డర్లను కొన్ని యాప్స్ వాడకం గురించి హెచ్చరించింది. భారతదేశ అతిపెద్ద బ్యాంక్ SBI లేటెస్ట్ గా తన కస్టమర్లను ఒక 4 యాప్స్ గురించి అలర్ట్ జారీ చేసింది. మరి ముఖ్యంగా ఒక నాలుగు యాప్స్ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అలర్ట్ జారీ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎందుకంటే, ఇప్పటికే ఈ నాలుగు యాప్స్ కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. అందుకే, SBI కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది. ఈ యాప్స్ ను Install చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారని సూచించింది.

విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్ (Anydesk), క్విక్ సపోర్ట్ (Quick Support), టీమ్ వ్యూవర్ (Teamviewer) మరియు మింగిల్ వ్యూ (Mingleview) యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది.

అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది.

అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo