శామ్సంగ్ గెలాక్సీ M33 5G పైన బంపర్ అఫర్..!!

HIGHLIGHTS

Samsung Galaxy M33 5G పైన అమెజాన్ బంపర్ అఫర్ ప్రకటించింది

అమెజాన్ అందించిన బంపర్ అఫర్ ద్వారా కొనేవారికి ఈ ఫోన్ మరింత చవకగా లభిస్తుంది

2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్

శామ్సంగ్ గెలాక్సీ M33 5G పైన బంపర్ అఫర్..!!

శామ్సంగ్ లేటెస్ట్ 5గు స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M33 5G పైన అమెజాన్ బంపర్ అఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను శామ్సంగ్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈరోజు అమెజాన్ అందించిన బంపర్ అఫర్ ద్వారా కొనేవారికి ఈ ఫోన్ మరింత చవకగా లభిస్తుంది. మరి ఈ ఫోన్ పైన అమెజాన్ అందించిన ఆఫర్లు మరియు ఫోన్ వివరాలను పరిశీలిద్దామా.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M33 5G: ధర మరియు ఆఫర్లు

శామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.17,999 మరియు 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అందుతుంది. అంటే, కేవలం రూ.15,999 రూపాయలకె ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. Buy From Here    

Samsung Galaxy M33 5G:స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి శామ్సంగ్ రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-V కటౌట్ కలిగిన 6.6- ఇంచ్ TFT డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ పూర్తి డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో జత చేసింది. ఈ M33 ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత 5G మరియు 5nm ప్రోసెసర్ Exynos 1280 కి జతగా 6/8GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ర్యామ్ కు సమానమైన వర్చువల్ ర్యామ్ ను కూడా ఇందులో అందించడం విశేషం.

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జర్ ను మాత్రం అందించడం లేదని కంపెనీ తెలిపింది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇలా చేయవలసి వచ్చినట్లు శామ్సంగ్ స్పష్టం చేసింది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-V కటౌట్ లో అందించింది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగివుంది. ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ రెండు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo