OTT లో దుమ్మురేపుతున్న జక్కన సినిమా RRR..!!

HIGHLIGHTS

RRR ఓటీటీ లో రికార్డులు బద్దలు కొడుతోంది

భారీ కలక్షన్స్ వసూలు చెయ్యడమే కాదు OTT లో కూడా దుమ్మురేపుతోంది

నాన్-ఇంగ్లీష్ చిత్రాలలో నంబర్ 1 గా నిలిచి అగ్రస్థానానికి చేరుకుంది

2022 అతిపెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా RRR ఓటీటీ లో రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ వసూలు చెయ్యడమే కాదు OTT లో కూడా దుమ్మురేపుతోంది. సరికొత్తగా రాజమౌళి సినిమా RRR మరొక కొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. OTT లో అత్యధికంగా వ్యూస్ అందుతున్న నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది. అంటే, RRR చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నాన్-ఇంగ్లీష్ చిత్రాలలో నంబర్ 1 గా నిలిచి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ చిత్రం Netflix లో టాప్ 10 లో ఉంది మరియు నాన్-ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.

కేవలం సినిమానే కాదు స్టార్ యాక్టర్స్ యొక్క అద్భుతమైన నటనా చాతుర్యం కూడా ప్రేక్షకుల కను విందు చేసింది. జూనియర్ NTR, రామ్ చరణ్, అజయ్ దేవగన్ మరియు అలియా భట్ కలిసి నటించిన ఈ యాక్షన్ చిత్రం సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మొదటి వారంలో ఈ చిత్రం 18.3 మిలియన్ గంటల వీక్షణా సమయాన్ని రాబట్టింది. ఈ చిత్రం వరుసగా రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 ఆంగ్లేతర చిత్రాలలో ఉంది మరియు ఈ చిత్రం 25.5 మిలియన్ గంటలకు పైగా OTT లో వీక్షించబడింది.

Zee5 లో అయితే ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం నాలుగు భాషల్లో కూడా అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా No 1 స్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల వసూళ్లను రాబట్టమే కాకుండా OTT లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసు దోచుకున్నచిత్రంగా కూడా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :