Jio పటాకా ఆఫర్: భారీ ప్రయోజనాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన జియో..!!

HIGHLIGHTS

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది

రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాని కూడా అఫర్ చేస్తుంది

Jio పటాకా ఆఫర్: భారీ ప్రయోజనాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన జియో..!!

రిలయన్స్ జియో తన కస్టమర్లకు గొప్ప ప్రయోజనాలను అందించేలా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. జియో పోర్ట్ ఫోలియోలో కొత్తగా జతచేసిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.259 రూపాయలకు వస్తుంది. అయితే, ఈ రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ, అంటే నెలలో ఎన్ని రోజులుంటే అన్ని రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో పాటుగా డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి మరిన్ని ప్రయోజాలను కస్టమర్లకు అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో రూ.259  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.259  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

ఇక సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కోసం చూనట్లయితే జియో యొక్క రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ అమౌంట్ ను 12 నెలలకు విడదీసి చూస్తే, నెలకు కేవలం రూ.250 రూపాయలు మాత్రమే అవుతుంది. అయితే, ఈ ప్లాన్ డైలీ 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలను తీసుకు వస్తుంది. ఈ జియో బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ అందించే లాభాలను గురించి క్రింద చూడవచ్చు.

Jio Rs.2,999 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రూ.499 రూపాయల విలువైన వన్ ఇయర్ డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సభ్యత్వం కూడా ఉచితంగా లభిస్తుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo