జియో జబర్దస్త్ అఫర్: జియో 2022 కొత్త సంవత్సర అఫర్ ప్రకటించింది
2022 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జియో బెస్ట్ అఫర్ ప్రకటించింది
29 రోజుల అధిక వ్యాలిడిటీ మరియు మరిన్ని లాభాలు
ఈ అఫర్ కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది
2022 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జియో బెస్ట్ అఫర్ ప్రకటించింది. Jio Happy New Year Offer పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా తన కస్టమర్లకు 29 రోజుల అధిక వ్యాలిడిటీ మరియు మరిన్ని లాభాలను రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్ లో జతచేసింది. అయితే, ఈ అఫర్ కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి ఈ కొత్త న్యూ ఇయర్ అఫర్ గురించి తెల్సుకుందామా..!
SurveyJio Happy New Year Offer:
ఈ ప్లాన్ రూ.2,545 రూపాయలకు వస్తుంది మరియు అఫర్ లో భాగంగా పూర్తి 365 రోజుల వ్యాలిటీని తీసుకువస్తుంది. వాస్తవానికి, ఈ ప్లాన్ ముందుగా 336 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అఫర్ చేసేది. అయితే, జియో ప్రకటించిన న్యూ ఇయర్ అఫర్ ద్వారా 29 రోజుల అదనపు వ్యాలిడిటీని కలుపుకొని ఇది మొత్తం పూర్తి సంవత్సరం వస్తుంది.
ఇక ఈ వ్యాలిడిటీ కాలానికి (336 రోజులు) గాను డైలీ 1.5 GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ అఫర్ చేస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS లిమిట్ తో పూర్తి 336 రోజులకు అందిస్తుంది మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకువస్తుంది.
ఇక డైలీ అధిక హై స్పీడ్ డేటా మరియు వన్ ఇయర్ వ్యాలిడిటీ కోరుకునే వారికి కూడా జియో బెస్ట్ ప్లాన్ అందించింది. అదే, Jio Rs.4,199 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.
Jio Rs.4,199 Plan
జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం ఇక్కడ Click చెయ్యండి
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile