JioCinema యూజర్లకు షాక్..ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్రకటన చేసిన రిలయన్స్.!

HIGHLIGHTS

JioCinema యూజర్లకు భారీ షాక్

Jio Cinema Premium మెంబర్ షిప్

యూజర్లకు అన్లిమిటెడ్ కంటెంట్ యాక్సెస్ అందుతుంది

JioCinema యూజర్లకు షాక్..ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్రకటన చేసిన రిలయన్స్.!

రిలయన్స్ జియో యొక్క ఎంటర్టైన్మెంట్ యాప్ JioCinema యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఉచితంగా సర్వీస్ తో జియో లాంచ్ చేసిన ఈ యాప్ యొక్క ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను రిలయన్స్ ప్రకటించింది. అయితే, IPL మ్యాచ్ లను మాత్రం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగానే ఆస్వాదించ వచ్చని రిలయన్స్ తెలిపింది. Jio Cinema Premium మెంబర్ షిప్ రేటు వివరాలతో పాటు ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తో యూజర్లకు కలిగే ప్రయాజనాలు ఏమిటి వివరంగా తెలుసుకుందాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Cinema Premium మెంబర్ షిప్ కోసం ప్రస్తుతానికి రిలయన్స్ కేవలం 1 సంవత్సరం ప్లాన్ ను మాత్రమే ప్రకటించింది. జియో సినిమా ప్రీమియం మెంబర్ షిప్ వన్ ఇయర్ ప్లాన్ ను రూ. 999 ధరతో ప్రకటించింది. ప్రీమియం మెంబర్ షిప్ తీసుకున్న యూజర్లకు అన్లిమిటెడ్ కంటెంట్ యాక్సెస్ అందుతుంది. 

రిలయన్స్ ఈ Jio Cinema Premium తో ప్రీమియం కంటెంట్ అనుభవాన్ని అందించడానికి HBO మరియు Warner Bros తో జత కట్టింది. అంటే, ప్రీమియం సబ్ స్క్రైబర్స్ HBO మరియు Warner Bros యొక్క ప్రీమియం కంటెంట్ ను జియో సినిమా యాప్ నుండి చూడవచ్చు. జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తో మొబైల్, ల్యాప్ టాప్ మరియు టీవీ పైన కూడా కంటెంట్ ను ఆస్వాదించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo