Redmi K50i: రేపు విడుదల కానున్న రెడ్మి స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

రెడ్‌మి యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Redmi K50i రేపు ఇండియాలో విడుదల కానుంది

ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది

144Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన డిస్ప్లే

Redmi K50i: రేపు విడుదల కానున్న రెడ్మి స్మార్ట్ ఫోన్.!

రెడ్‌మి యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Redmi K50i రేపు ఇండియాలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల కంటే ముందుగానే రిలయన్స్ జియో తో కలిసి సంయుక్తంగా 5G నెట్ వర్క్ పైన టెస్టింగ్ ను కూడా కంపెనీ నిర్వహించింది. ఈ చర్యతో ఈ 5G నెట్ వర్క్ టెస్టింగ్ ద్వారా ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ గురించి సూచించింది. జూలై 20 న ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చేయబడుతుంది. ఈ ఫోన్ Dolby Vision సపోర్ట్ కలిగిన డిస్ప్లేతో పాటుగా Dolby Atmos స్పోర్ట్ కలిగిన స్పీకర్ లతో వస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi K50i 5G    

ఇక Redmi K50i 5G యొక్క మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా LPDDR5 RAM ను ఉన్నట్లు షియోమీ సూచించింది. అలాగే, ఈ ఫోన్ ను మరింత వేగంగా చల్లబరిచే LiquidCool 2.0 ఫీచర్ తో తీసుకువస్తున్నట్లు టీజర్ లో చూపించింది. అలాగే, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన డిస్ప్లే ను కూడా ఈ ఫోన్ లో అందించినట్లు చూపిస్తోంది.  Dolby Atmos స్పోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు, X-Axis వైబ్రేషన్ మోటార్, భారీ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ ను తీసుకువస్తునట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది.

జియో 5G నెట్ వర్క్ పైన చేసిన టెస్టింగ్ లో అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ స్పీడ్‌లు రెండూ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని పరీక్ష ఫలితాలు చూపించాయి. అంతేకాదు, వివిధ తీవ్రమైన పరిస్థితులలో టెస్టింగ్ చేయబడినా కూడా ఈ స్మార్ట్‌ ఫోన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. Redmi K50i స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ప్రతి ఒక్క వినియోగదారు ఉత్తమ అనుభవాన్ని అందించడమే  కంపెనీ లక్ష్యంగా చెబుతోంది. ఇది మాత్రమే కాదు,  నెట్‌ వర్క్‌ లకు యాక్సెస్‌ను విస్తరించడానికి 12 5G బ్యాండ్‌ లను ప్యాక్ చేసిన మొదటి Redmi స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo