Realme TechLife ఎకోసిస్టమ్ ద్వారా లేటెస్ట్ Split AC లను ప్రకటించింది. ఈ లేటెస్ట్ రియల్ మీ AC (ఎయిర్ కండిషన్స్) లను కేవలం రూ.27,790 రూపాయల ప్రారంభ ధర నుండి అఫర్ చెయ్యడం విశేషం. అంతేకాదు, ఈ కొత్త స్ప్లిట్ AC (ఎయిర్ కండిషన్స్) లను 1 టన్ మరియు 1.5 టన్ సామర్ధ్యంతో 4 స్టార్ మరియు 5 స్టార్ రేటింగ్ లలో అందించింది. అంటే,వినియోగదారులు వారి వినియోగ అవసరం మరియు బడ్జెట్ లను దృష్టిలో ఉంచుకొని ఎంచుకునే వీలుంటుంది. మరి ఈ కొత్త రియల్ మీ ఎయిర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
ముందుగా, Realme TechLife ద్వారా తీసుకురాబడిన ఈ కొత్త స్ప్లిట్ AC (ఎయిర్ కండిషన్స్) ధరలను పరిశీలిద్దాం.
మీరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎయిర్ కండీషనర్‌ను కొనుగోలు చేయవచ్చు.
Realme స్ప్లిట్ AC: స్పెక్స్ మరియు ఫీచర్లు
రియల్ మీ తీసుకువచ్చిన ఈ కొత్త AC లు 4-in-1 కన్వర్టిబుల్ డిజైన్‌తో వస్తాయి. అంటే, మీ అవసరాన్ని బట్టి కూలింగ్ ను 40%, 60%, 80% మరియు 110% కెపాసిటీకి సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. అంతేకాదు, ఈ AC లు గరిష్టంగా 55 డిగ్రీల వేడిలో కూడా చక్కగా పని చేయగలవని కంపెనీ పేర్కొంది. ఇక మైన్ స్పెక్స్ లోకి వెళితే ఈ AC కాపర్ కాయిల్ తో కూడిన వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్ ఉంది. అంతేకాదు, 'తక్కువ విధ్యుత్ వినియోగంతో, గదిని వేగంగా చల్లబరిచే మరియు ఎక్కువ మన్నికమైన కంప్రెసర్' ఇందులో అందించినట్లు కూడా కంపెనీ తెలిపింది.
అలాగే, ఇందులో అందించిన కాయిల్ బ్లూ ఫిన్ యొక్క యాంటీ-కారోసివ్ ఎలిమెంట్‌తో పూత చేయబడింది మరియు ఇది నీటి బిందువులు, ఉప్పు మరియు యాసిడ్ వంటి వాటినుండి రక్షణ కల్పించి ఎక్కువ కాలం మన్నేలా చేస్తుందని కూడా రియల్ మీ చెబుతోంది. ఇందులో, ఏసీ ని దానికదే కేలీన్ చేసుకునేలా Auto Clean ఫీచర్ వుంది మరియు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ R32 కూలెంట్, స్టెబిలైజర్-రహిత ఆపరేషన్ (165~265V పరిధిలో) మరియు సైలెంట్ ఆపరేషన్‌ను వంటివి వున్నాయి.