HIGHLIGHTS
PUBG New State ఈరోజు ఇండియాలో ప్రారంభించబడింది
నెక్స్ట్ జెనరేషన్ బ్యాటిల్ రాయల్ గేమ్
ఈ గేమ్ 40 మిలియన్స్ కంటే ఎక్కువ Pre-Registrations సాధించింది
క్రాఫ్టన్ యొక్క PUBG New State ఈరోజు ఇండియాలో ప్రారంభించబడింది. Krafton మరియు PUBG Studios సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ నెక్స్ట్ జెనరేషన్ బ్యాటిల్ రాయల్ గేమ్ ను ప్రారంభించాయి. ఈ గేమ్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఆండ్రాయిడ్ యూజర్లు సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విడుదల కంటే ముందే ఈ గేమ్ 40 మిలియన్స్ కంటే ఎక్కువ Pre-Registrations సాధించింది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఈ గేమ్ ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చెయ్యబడింది.
SurveyPUBG New State గేమ్ లో Troi అని పిలువబడే కొత్త బ్యాటిల్ గ్రౌండ్ ను అందించింది. ఇది అధునాతన ఆయుధాలతో నిండిన 8Km X 8Km మ్యాప్. పబ్ జి న్యూ స్టేట్ తో మొబైల్ గేమింగ్‌కి కొత్త రూపు వచ్చింది. అంతేకాదు, గ్లోబల్ ఇల్యూమినేషన్ టెక్నాలజీతో చూడబోయే వాస్తవిక గ్రాఫిక్‌లను కూడా పొందబోతున్నారు.
ఈ గేమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లకు అందుబాటులో వుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఫోన్ లేదా డివైజ్ ను బట్టి దీని పరిమాణం వేరువేరు సైజులలో ఉంటుంది. ఉదారణకు: స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పీపనిచేసే ఫోన్లలో దీని పరిమాణం 1.67GB గా ఉంటుంది. ఇక మీరు iOS ప్లాట్‌ఫారమ్ డివైజెస్ కలిగి ఉంటే దీని డౌన్‌లోడ్ పరిమాణం దాదాపు 1.2GB గా ఉండవచ్చు.