e-RUPI ని ప్రారంభించిన PM మోడీ: ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

e-RUPI ని ప్రారంభించిన PM మోడీ: ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
HIGHLIGHTS

e-RUPI ని ప్రారంభించిన PM మోడీ

డిజిటల్ పేమెంట్ సొల్యూషన్

QR Code లేదా SMS ద్వారా ఈ e-RUPI వోచర్ ను ఎవరికైనా పంపించవచ్చు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో కొత్త నగదు రహిత (Cashless) పేమెంట్ సొల్యూషన్ గా e-RUPI ని లాంచ్ చేశారు. ఇది ఎలక్ట్రానిక్ క్యాష్ మరియు పూర్తి ట్రాన్స్పరెన్సీ కలిగిఉంటుంది. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింత ముందుకు నడిపించడానికి ఈ e-RUPI తీసుకొచ్చారు. QR Code మరియు e-Vocher ఆధారంగా ఈ e-RUPI వ్యవస్థ పనిచేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ వోచర్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ ను ప్రారంభించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్‌ను ఉపయోగించకపోయినా e-RUPI ఉపయోగించవచ్చు.

e-RUPI ఎలా పనిచేస్తుంది?

ఇది QR Code మరియు e-Vocher ఆధారంగా ఈ e-RUPI వ్యవస్థ పనిచేస్తుంది. ఇది వినియోగదారుల మొబైల్ నంబర్ కు పంపించబడుతుంది. వినియోగదారుల ఐడెంటిటీ మరియు మొబైల్ నంబర్ ను ధ్రువీకరించడం ద్వారా e-RUPI ప్రీపెయిడ్ వోచర్ వలే పనిచేస్తుంది. ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ కు డబ్బును పంపడానికి బదులుగా, అతను e-RUPI వోచర్ అందుకుంటారు. QR Code లేదా SMS ద్వారా ఈ e-RUPI వోచర్ ను ఎవరికైనా పంపించవచ్చు.

ఎటువంటి పేమెంట్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ATM కార్డ్ అవసరం లేకుండానే ఈ ఇ-రూపీ వోచర్ ను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ వోచర్ ను పంపిన వ్యక్తి మాత్రమే ఈ వోచర్ ను ఒక్కసారి ఉపయోగించుకోగలరు. ఈ వోచర్ ను ఏ మొబైల్ నంబర్ తో అయినా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ పథకాల ద్వారా అందించే డబ్బు లేదా ఆర్ధికసహాయాన్ని మధ్యలో ఎటువంటి అడ్డంకి లేకుండా నేరుగా ప్రజల వద్దకే చేరేలా చెయ్యడమే ఈ e-RUPI యొక్క లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo