plastic currency news which circulating in social media fact check telugu
ఇటీవల సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ లలో ఒక కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. అదేమిటంటే, జూన్ 30 తర్వాత భారతదేశంలో కాగితపు నోట్లు చెల్లవు మరియు వాటి స్థానంలో ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లు వస్తున్నాయి, అంటూ కుప్పలు తెప్పలుగా సందేశాలు షేర్ అవుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో నిజానిజాలు తెలిపే ఫ్యాక్ట్ చెక్ చేసాము. జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా Plastic Notes రాబోతున్నాయి అని చెబుతున్న సోషల్ మీడియా న్యూస్ నిజం తెలుసుకోండి.
వైరల్ మెసేజ్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం మరియు RBI కలిసి జూన్ 30 నుంచి ప్రస్తుతం వాడుకలో ఉన్న కాగితపు నోట్లను ఉపసంహరించుకుని ప్లాస్టిక్ నోట్లను ప్రవేశ పెట్టబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న నోట్లు చెల్లవన్న అపోహ కూడా ప్రజల్లో వ్యాపిస్తోంది. అయితే, ఈ వైరల్ న్యూస్ గురించి పూర్తి నిజం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము.
ఈ వార్త పూర్తిగా తప్పుడు ప్రచారం (Fake News) అని ఫ్యాక్ట్ చెక్ లో తేలిపోయింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లేదా కేంద్ర ప్రభుత్వం జూన్ 30 నుంచి కాగితపు నోట్లను రద్దు చేస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200 మరియు రూ. 500 నోట్లు యథావిధిగా చెల్లుబాటులో ఉంటాయి. ప్లాస్టిక్ నోట్స్ గురించి సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం జరుగుతోందని “PIB Fact Check” తన అఫీషియల్ అకౌంట్ నుంచి అనౌన్స్ చేసింది.
RBI గతంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం, నకిలీ నోట్లను తగ్గించే అవకాశం ఉండటం వంటి కారణాలతో ఈ ప్రతిపాదనపై అధ్యయనం జరుగుతోంది. అయితే, దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లు అమలు చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
కానీ, కారణం లేకుండానే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే మన సోషల్ మీడియా ఈ ఇంత పెద్ద మేటర్ ని వదిలేస్తారా? జస్ట్ విషయం బయటకు వచ్చిందో లేదో ఫేక్ న్యూస్ తో సోషల్ మీడియా మొత్తం నింపేశారు. అయితే, ఇలాంటి అసత్య ప్రచారం కారణంగా అమాయక ప్రజలు ఎన్ని ఇక్కట్లు పడతారు అని కూడా ఆలోచించాలి.
Also Read: LG 3.1.1 Dolby Atmos సౌండ్ బార్ జూన్ ఎపిక్ సేల్ నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.!
ఇలాంటి కరెన్సీ, బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వైరల్ మెసేజ్ లను చూసిన వెంటనే నమ్మవద్దు. RBI, PIB Fact Check లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ మరియు సోర్స్ ల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించండి.
“జూన్ 30 నుంచి కాగితపు నోట్లు రద్దు.. ప్లాస్టిక్ నోట్లు తప్పనిసరి” అనే వార్త పూర్తిగా అసత్యం. ప్రస్తుతం ఉన్న భారత కరెన్సీ నోట్లు చెల్లుబాటు లోనే ఉన్నాయి. ప్రజలు ఈ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదు.