Paytm మహా క్యాష్ బ్యాక్ సేల్ అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 15 వరకు
స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కెమెరాలు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ టీవీల తోపాటుగా మరెన్నో డీల్స్ అందించనుంది Paytm .
పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 15 వరకు, పేటిఎమ్ మాల్ నుండి అందించనుంది. ఈ సేల్ సమయంలో ఈ కంపెనీ వివిధ రకాలైన డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ మరియు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కెమెరాలు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు మరియు కన్జ్యుమార్ ఎలక్ట్రానిక్స్ వాటి వాటిపైన ప్రైస్ డ్రాప్ వంటివి ఆఫర్ చేస్తోంది. ఇంకా అదనంగా, ఈ సేల్ సమయంలో Re 1 డీల్స్ మరియు డైలీ ఫ్లాష్ సేల్స్ వంటివి నిర్వహిస్తుంది. అలాగే, 5000 కంటే ఎక్కువ బ్రాండ్స్ తో నిర్వహించే ఈ సేల్ నుండి కొనుగోలు చేయడం ద్వారా, వినియోగదారులకి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ మరియు ప్రతిరోజూ ఒక Renalt KWID గెలుచుకునే అవకాశం కూడా అందిస్తుంది ఈ సేల్ సమయంలో.
Surveyప్రస్తుతం కొన్ని ముందస్తు డీల్స్ ని ప్రకటనల ద్వారా చూపుతుంది ఈ మహా మహా క్యాష్ బ్యాక్ సేల్, పేటిఎమ్ నుండి అవి – iphone X మీద Rs.12,000 ఫ్లాట్ క్యాష్ బ్యాక్, Vivo V7 మీద Rs.2,000 క్యాష్ బ్యాక్, Vivo V11 Pro మీద Rs.3,000 ఎక్స్చేంజి బోనస్, Oppo F9 Pro పైన Rs.3,000 ఎక్స్చేంజి బోనస్, ఇంకా ల్యాప్ టాప్ల పైన Rs.5000 క్యాష్ బ్యాక్ మరియు కనీస Rs.2500 క్యాష్ బ్యాక్ అందిస్తుంది బ్లూటూత్ స్పీకర్లపైన, ఇంకా ఇలాంటివి చాల ఆఫర్లని ఇస్తుంది.
వారం రోజుల పాటు జరిగే షాపింగ్ ఫెస్టివల్ లో, Paytm పై ఉన్న మహ కాష్బ్యాక్ అమ్మకం నుండి కొనుగోలుదారులు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, మైక్రోవేవ్స్, మిక్సర్ గ్రిన్డర్లు మరియు మరెన్నో ఉపకరణాలపై 2 రోజుల ఉచిత డెలివరీలతో పాటు 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ కొనుగోలుదారులకు ఇస్తారు. అలాగే, ఈ రూ. 10,000 వరకు క్యాష్ బ్యాక్ కూడా వివిధ మొబైల్ ఫోన్లలో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్లను కొనుగోలుతో నో కాస్ట్ EMI కలిపి ఉంటుంది. కొన్ని స్మార్ట్ టీవీలు 20 వేల ధరకే నిర్ణయించబడతాయి. అలాగే, ఈ ప్లాట్ఫారమ్ మీద స్కూటర్లు, బైకులను కొనుగోలు చేయడంతో పాటు, నగదు లాభాలు కూడా జతచేయబడతాయి.
ఇంకా, Paytm ప్రతిరోజు ఫ్లాష్ అమ్మకాలను నిర్వహిస్తుంది అక్టోబర్ 9 నుండి – Oct 15 వరకు ఇది 2PM ప్రారంభమవుతుంది మరియు 6PM వరకు ఉంటుంది. వినియోగదారులు 8PM నుండి అర్ధరాత్రి వరకు ఉత్పత్తులపై ధర తగ్గింపులను చూడవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు హోల్డర్లు పూర్తి చెల్లింపులు లేదా EMI లావాదేవీలకు వారి కార్డులను ఉపయోగించడం ద్వారా అదనపు 10% క్యాష్ బ్యాక్ పొందుతారు.