OnePlus 6 మరియు OnePlus 6T కోసం ‘ఆండ్రాయిడ్ Q’ బీటా 2 విడుదల

OnePlus 6 మరియు OnePlus 6T కోసం ‘ఆండ్రాయిడ్ Q’ బీటా 2 విడుదల
HIGHLIGHTS

ఇప్పుడు కంపెనీ వన్‌ప్లస్ 6-సిరీస్ స్మార్ట్‌ఫోన్ కోసం ఆండ్రాయిడ్ క్యూ బీటా 2 అప్‌డేట్‌ను విడుదల చేసింది.

వన్‌ప్లస్ గురించి చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే, సంస్థ తన పరికరాలకు సరికొత్త సాఫ్ట్‌వేర్ మద్దతును ముందుగా అందిస్తుంది. ప్రస్తుతం, రాబోయే ఆండ్రాయిడ్ క్యూ బీటా ఓఎస్ ఇప్పటికే వన్‌ప్లస్ 7 మరియు వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉంది. అయితే, వన్‌ప్లస్ ఇప్పుడు ముందుగా 2018 లో ప్రారంభించిన వన్‌ప్లస్ 6 మరియు 6 T కోసం ఈ బీటా బిల్డ్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ వన్‌ప్లస్ 6-సిరీస్ స్మార్ట్‌ఫోన్ కోసం ఆండ్రాయిడ్ క్యూ బీటా 2 అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ROM కోసం డౌన్‌లోడ్ లింక్ వన్‌ప్లస్ ఫోరమ్‌లో ఉంచబడింది. మీరు గనుక ఒక వన్‌ప్లస్ 6 యూజర్ అయితే, వన్‌ప్లస్ ఫోరమ్‌లోని లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా మీరు తాజా బీటా లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారమ్‌లో అప్డేట్  డౌన్‌లోడ్ చేయడానికి తగిన సూచనలు ఇవ్వబడ్డాయి. మీరు స్థిరమైన అప్డేట్ కోసం తిరిగి వెళ్లాలనుకుంటే, కావాల్సిన సూచనలు ఇక్కడ ఉన్నాయి.

వన్‌ప్లస్ 6 మరియు వన్‌ప్లస్ 6 టి కోసం అందించిన ఈ బీటా బిల్డ్‌లో కొన్ని దోషాలు ఉన్నాయి. మీరు ఈ క్రొత్త OS ని ప్రయత్నిస్తుంటే, మీ రోజువారీ వినియోగంలో కొంత ఇబ్బంది తలెత్తవచ్చు.

OnePlus బీటా సమస్యలు 

  • అత్యవసర కాల్లు పనిచేయవు
  • మెరుగైన VoLTE పనిచేయదు
  • స్క్రీన్షాట్లు సరిగా పనిచేయవు
  • లో  ప్రాబబిలిటీ స్థిరత్వ సమస్య
  • అప్లికేషన్ అనుకూలత సమస్య

మీరు ఈ క్రొత్త OS ని ప్రయత్నించాలనుకుంటే, అప్పుడు ROM ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, అంతర్గత స్టోరేజి యొక్క రూట్ డైరెక్టరీలో సేవ్ చేయండి. సెట్టింగులకు వెళ్లి సిస్టమ్ ఆప్షన్స్‌పై క్లిక్ చేసి, సిస్టమ్ అప్‌డేట్‌లకు వెళ్లి, కుడి వైపు ఎగువ ఐకాన్‌పై క్లిక్ చేసి లోకల్ అప్‌గ్రేడ్‌కు వెళ్లండి.

డౌన్‌లోడ్ చేసిన ROM ప్యాకేజీని ఎంచుకోండి మరియు అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత ఫోన్ రీస్టార్ట్  చేయబడుతుంది. ఇన్‌స్టాలేషన్‌కు ముందు మీ డేటాను బ్యాకప్ చేయండి మరియు మీ ఫోన్‌లో కనీసం 30 శాతం బ్యాటరీ మరియు 3GB స్థలం ఉండాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo