npci release new Call Merging Scam alert
దేశంలో కొత్త స్కామ్ కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశంలో రకరకాల స్కామ్ లు సర్క్యులేట్ అవుతుంటే, ఇప్పుడు మరో కొత్త స్కామ్ కలవర పెడుతోంది. ప్రస్తుతం దేశంలో కొత్తగా Call Merging Scam ఎక్కువ జరుగుతుందని, కొత్త స్కామ్ గురించి NPCI మొత్తుకుంటోంది. ఈ స్కామ్ గురించి UPI అధికారిక X అకౌంట్ నుంచి అలర్ట్ ను జారీ చేసింది. అంతేకాదు, ఈ కొత్త స్కామ్ గురించి అందరికి తెలిసేలా ఈ పోస్ట్ ను షేర్ చేయాలనీ కూడా రిక్వెస్ట్ చేస్తోంది. మరి ఈ కొత్త స్కామ్ ఏమిటో వివరంగా తెలుసుకుందామా.
సిటీ లో జరగబోతున్న అప్ కమింగ్ బిగ్ ఈవెంట్ కోసం మీ నెంబర్ మీ ఫ్రెండ్ ఇచ్చారు, మీ కాల్ ను మెర్జ్ చేయమన్నారు అని విన్నవిస్తారు. ఈ కాల్ మెర్జ్ కోసం లేదా ఈవెంట్ రిజిస్టర్ కోసం మీ నెంబర్ కు ఒక OTP వస్తుందని అడుగుతారు. అంతేకాదు, ముఖ్యంగా ఈ ఫ్రెండ్ కొత్త నెంబర్ తో కాల్ మెర్జ్ చేస్తున్నారు అని కూడా చెబుతారు. వాస్తవానికి, ఇది ఫ్రెండ్ కాల్ కాదు బ్యాంక్ OTP కాల్. ఈ కాల్ ద్వారా OTP అందుకుని అకౌంట్ ను ఖాళీ చేస్తారు.
ఇటీవల కాలంలో ఈ స్కామ్ ఎక్కువగా జరుగుతున్నట్లు NPCI అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న ఈవెంట్ ట్రెండ్ ను తమ స్కామ్ కు అడ్డాగా మార్చుకొని కాల్ మెర్జ్ పేరుతో స్కామర్లు అమాయకుల అకౌంట్ లను కొల్లగొడుతున్నారని NPCI క్లియర్ మెసేజ్ ఇచ్చింది. NPCI అండర్ లోని UPI అధికారిక X అకౌంట్ నుంచి ఈ అలర్ట్ వివరాలు షేర్ చేసింది. ఈ మెసేజ్ వీలైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయాలని కూడా విన్నవించింది.
Also Read: గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ కంటే ముందే భారీగా తగ్గిన Google Pixel 8a ధర.!
అయితే , స్కామ్ జరిగినట్లు లేదా మీకు వచ్చిన కాల్ స్కామర్లు చేసిన కాల్ గా మీకు అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయండి, అని కూడా UPI పోర్టల్ చెబుతోంది. అంతేకాదు, ఇటువంటి మోసాలను cybercrime.gov.in లో నేరుగా కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా దేశంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. అయితే, డిజిటల్ అరెస్ట్ అనేది పెద్ద బూటకపు మాట. ఇటువంటి కాల్స్ మీరు మీ నెంబర్ పై అందుకున్నట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. కాల్ కట్ చేసి వెంటనే 1930 కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి.