Whatsapp Trick: డేటా ఖర్చుకాకుండా వాట్సాప్ వాడవచ్చు

Whatsapp Trick: డేటా ఖర్చుకాకుండా వాట్సాప్ వాడవచ్చు
HIGHLIGHTS

వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

వాట్సాప్ లో బెస్ట్ ట్రిక్

ఎక్కువ డేటా వాడకుండానే వాట్సాప్ ఉపయోగించవచ్చు

రోజులో అత్యధికంగా ఉపయోగించే యాప్ ఏదంటే Whatsapp అని ఠక్కున చెప్పొచ్చు. ఈ యాప్ తో చాటింగ్ , మీడియా షేరింగ్, వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్…ఇలా ప్రతి అవసరానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, ఇలా ప్రతి అవసరానికి ఉపయోగపడే ఈ యాప్ మీ డేటాని పూర్తిగా హరించవచ్చు. అందుకే, ఎక్కవగా డేటాని వాడకుండానే మీ Whatsapp ని ఎలా ఉపయోగించ వచ్చునో ఈరోజు చూద్దాం..                   

 ప్రస్తుతం, మనం ఎక్కువగా ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనందరికీ ఎక్కువ డేటా మరియు ఇంటర్నెట్ వేగం అవసరం అవుతాయి. అందుకే, దీనికోసం కొన్ని మంచి పరిష్కారాలను చూడడం మంచింది. తద్వారా వాట్సాప్‌ లో ఉపయోగించబడుతున్న మరింత డేటాను సేవ్ చేయవచ్చు.

కొన్ని నివేదికల ప్రకారం, వాట్సాప్ వాయిస్ కాల్స్‌ కోసం నిమిషానికి 740 Kb ల డేటా ఉపయోగిస్తుంది. ఇంటర్నెట్ రద్దీని తగ్గించాలని, తద్వారా అవసరమైన సేవలకు బ్యాండ్‌విడ్త్ ఆదా చేయాలని COAI గతంలో ప్రజలను అభ్యర్థించింది.

ఏమిచేయాలి?

ఈ విధంగా చేస్తే మీరు వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.

ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.

అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.

దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.

ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన ఎంపికను తీసివేయండి.

అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo