Vivo tab: మొదటిసారిగా వివో ట్యాబ్లేట్…ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

వివో ట్యాబ్లేట్ Snapdragon 870 తో వస్తున్నట్లు లీక్స్ వెల్లడి

TUV Rheinland సర్టిఫికేషన్ వెబ్సైట్ లో కూడా కనిపించినట్లు తెలుస్తోంది

వివో ట్యాబ్లేట్ వేగంగా పనిచేయగాల సత్తాతో వస్తుంది

Vivo tab: మొదటిసారిగా వివో ట్యాబ్లేట్…ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

ఈ సంవత్సరం ప్రారంభంలోనే వివో కంపెనీ యూరోపియన్ యూనియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ (EUIPO)తో Vivo Pad ని ట్రేడ్ మార్క్ చేసింది. అలాగే, కంపెనీ దృవీకరించినట్లుగా 2022 సంవత్సరం అర్ధభాగంలో ఈ వివో ట్యాబ్లేట్ మార్కెట్లో అడుగుపెడుతుంది. అయితే, ఇప్పటి వరకూ ఈ ట్యాబ్ గురించి ఎటువంటి వివరాలు తెలియనప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక లీక్ ఈ టాబ్లెట్ Qualcomm చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుందని చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo Pad: స్పెక్స్

ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ స్టేషన్ అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ Snapdragon 870 ప్రోసెసర్ తో వస్తుందని వెల్లడించింది. ఈ ప్రోసెసర్ తో X60 ప్రో మరియు iQOO 7 వంటి కొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్లను ఇప్పటికే వివో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇదే కనుక నిజమైతే వివో ట్యాబ్లేట్ చాల వేగంగా పని చెయ్యగలదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

మరిన్ని లీక్డ్ వివరాల్లోకి వెళితే, ఈ అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ TUV Rheinland సర్టిఫికేషన్ వెబ్సైట్ లో కూడా కనిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, 8040mAh హెవీ బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo