ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంటరాక్టివ్ టూల్ OpenAI యొక్క ChatGPT యొక్క లేటెస్ట్ వెర్షన్ కూడా వచ్చేసింది. ఈ కొత్త వెర్షన్ వస్తూనే మళ్ళీ కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి వచ్చిన కొత్త వెర్షన్ ChatGPT4 మరింత ఆక్యురేట్ ఉంటుందని మరియు ఇది చాలా ఉద్యోగాలకు రీప్లేస్ కావచ్చని కూడా నెట్టింట్లో పెద్ద రచ్చే జరుగుతోంది. చాట్ జీపీటీ4 తో ఎఫెక్ట్ కావచ్చని చెబుతున్న ఆ 20 జాబ్స్ ఏమిటో చూద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ChatGPT గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ AI ప్లాట్ఫామ్ చెయ్యలేని పనిలేదని ఇది చాలా మంది ఉద్యోగాలకు రీప్లేస్ కావచ్చని కూడా చెబుతున్నారు. అందుకే, దీని పైన వ్యాపార దిగ్గజాలు ఏమనుకుంటున్నాయో తెలుసుకునేందుకు resumebuilder.com ఒక సర్వే నిర్వహించగా అందులో మెజారిటీ ChatGPT కి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ChatGPT4 రీప్లేస్ చెయ్యగలిగిన జాబ్స్ ఏవని ChatGPT అడిగితే, అది వెంటనే 20 జాబ్స్ లిస్ట్ ను అందించింది. ఈ లిస్ట్ ను క్రింద చూడవచ్చు మరియు ఇదే విషయాన్ని ప్రముఖ మెషిన్ లెర్కింగ్ ఇంజనీర్ Rowan Cheung ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.