MIUI 12 Update: ఈ కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న షియోమీ ఫోన్లు ఇవే

MIUI 12 Update: ఈ కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న షియోమీ ఫోన్లు ఇవే
HIGHLIGHTS

MIUI 12 Update ఇప్పుడు ఇండియాలో అధికారికంగా విడుదల చెయ్యబడింది.

ఈ MIUI 12 కొత్త అప్డేట్ షావోమి ఫోన్లను పూర్తిగా అట్టడుగునుండి మార్చి వేస్తుంది.

ఈ MIUI 12 Update తరువాత షావోమి స్మార్ట్ ఫోన్లు పూర్తిగా కొత్త ఫిచర్లతో మరియు కొత్త వివరాలతో కనిపిస్తాయి.

MIUI 12 Update ఇప్పుడు ఇండియాలో అధికారికంగా విడుదల చెయ్యబడింది. ఈ MIUI 12 కొత్త అప్డేట్ షావోమి ఫోన్లను పూర్తిగా అట్టడుగునుండి మార్చి వేస్తుంది. అంటే, ఈ అప్డేట్ తరువాత షావోమి స్మార్ట్ ఫోన్లు పూర్తిగా కొత్త ఫిచర్లతో మరియు కొత్త వివరాలతో కనిపిస్తాయి. అందులో, ముఖ్యంగా Live Wallpapers, ఫ్లోటింగ్ విండోస్ మరియు Ultra Power Saving Mode వంటివి వినియోగదారులను మరింతగా ఆకర్షించేవిగా వుంటాయి. ఇక అప్డేట్ ముందుగా అందుకోనున్న షావోమి స్మార్ట్ ఫోన్ల లిస్ట్ క్రింద చూడవచ్చు.              

MIUI 12 Update రోల్ అవుట్ టైమ్ ‌లైన్:

Mi 10 సిరీస్ , Redmi Note 9 సిరీస్ , Note 8 సిరీస్ , Note 7 series ఈ అప్డేట్ అందుకునే వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.

MIUI 12 Update ఇప్పటికే భారతదేశంలో mi మరియు రెడ్‌మి స్మార్ట్‌ ఫోన్ ‌లకు అందుబాటులోకి వచ్చింది. కొంతమంది వినియోగదారులు Poco X 2, రెడ్‌మి నోట్ 9  స్మార్ట్ ఫోన్లలో ఈ అప్ ‌డేట్ అందుకున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. అదనంగా, షియోమి మి 10, రెడ్‌మి నోట్ 9, నోట్ 8 మరియు నోట్ 7 సిరీస్‌ లలో ఆగస్టులో ఏ MIUI 12 అప్డేట్ స్వీకరించనున్నట్లు చెప్పారు.

Xiaomi తన షోషల్ నెట్ వర్క్స్ ద్వారా MIUI 12 అప్డేట్ అందుకోనున్న మరిన్ని స్మార్ట్ ఫోన్స్ గుంచి కూడా తెలియజేస్తుంది. మీ Xiaomi స్మార్ట్ ‌ఫోన్ ‌లో MIUI 12 కు అప్డేట్ మీ ఫోనులోవచ్చిందో లేదో తనిఖీ చేయడానికి, మీ Xiaomi స్మార్ట్ ఫోనులో Settings → About Phone → System Update → Check for Update. షియోమి దశల వారీగా ఈ అప్డేట్ ను అందిస్తుంది, కాబట్టి తిరిగి మరొకసారి చెక్ చేయండి లేదా నోటిఫికేషన్ కోసం వేచి ఉండండి.

MIUI 12 Update: టాప్ ఫీచర్స్

MIUI 12 Update గురించి షియోమి మాట్లాడుతూ, సిస్టమ్-వైడ్ ఫ్లూయిడ్ యానిమేషన్‌ ను అనుమతించే కొత్త యానిమేషన్ రెండరింగ్ ఇంజిన్‌ తో UI ని అట్టడుగు నుండి రిఫ్రెష్ చేస్తుంది మరియు ఆసక్తికరంగా, సంస్థ యాప్స్ తో పాటు థర్డ్ పార్టీ యాప్స్ ను కవర్ చేసే యాప్స్ డ్రాయర్ మరియు మరింత ఇంటిగ్రేటెడ్ డార్క్ మోడ్ ని కూడా తీసుకొచ్చింది.

MIUI 12 యాప్ ద్వారా స్టేటస్ బార్ చిహ్నంగా ఉపయోగించబడే అనుమతులను నిరంతరం చూపిస్తుంది, ఒక యాప్ కెమెరా, మైక్రో ఫోన్ మొదలైన క్లిష్టమైన భాగాలను బ్యాగ్రౌండ్ లో ఉపయోగిస్తున్నప్పుడు, వాటిని గురించి వినియోగదారులకు తెలియజేస్తుంది.

కొత్త లైవ్ వాల్‌ పేపర్‌ లు, AOD నమూనాలు, తేలియాడే విండోస్, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ అంతర్నిర్మిత స్లీప్ ట్రాకర్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo