Meta AI Muse Voice Transcribe announced with 70 languages
Meta AI Muse Voice Transcribe: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మెటా మరో కీలక అడుగు వేసింది. మనం మాట్లాడే మాటలను రియల్ టైమ్ లో టెక్స్ట్‌గా మార్చే కొత్త సాదనం తెచ్చింది. ఇందులో వింతేముంది అనుకోకండి, ఒకే సమయంలో చాలా మంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కూడా వారి వాయిస్ లను స్పష్టంగా గుర్తించగలిగేలా ఈ కొత్త AI మోడల్ ను రూపొందించింది. ఈ కొత్త మోడల్ ని మూస్ వాయిస్ ట్రాన్స్ క్రైబ్ పేరుతో అందించింది.
ఈ కొత్త మెటా ఏఐ మోడల్ గురించి సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే, మన మాటలు వింటూ, అది పూర్తయ్యే లోపే టెక్స్ట్‌గా మార్చే కొత్త AI టెక్నాలజీగా చెప్పొచ్చు. ఇది కేవలం రికార్డింగ్ ను టెక్స్ట్‌గా మార్చే సాధారణ ట్రాన్స్ క్రిప్షన్ టూల్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, ఇది ఒకే సమయంలో చాలా మంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కూడా వారి వాయిస్ లను స్పష్టంగా గుర్తించగలదు. అంటే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడటం ప్రారంభించారు, ఎప్పుడు మాటలు ఆపారు వంటి విషయాలను కూడా ఈ కొత్త AI మోడల్ గుర్తించగలదు.
మెటా ప్రకారం, ఈ మోడల్ రియల్ టైం స్ట్రీమింగ్ ఆటోమేటిక్ స్ట్రీమింగ్ రికగ్నైజేషన్, స్పీకర్ డిరైజేషన్ మరియు ఎండ్ పాయింటింగ్ వంటి సామర్ధాలు ఒకే సిస్టమ్ లో అందిస్తుంది. ముఖ్యంగా, ఈ మోడల్ కు 70 కి పైగా భాషలపై శిక్షణ ఇచ్చినట్లు మెటా తెలిపింది. ప్రారంభ దశలో ఇందులో 25 కి పైగా భాషలు చాలా విస్తృతమైన ధ్రువీకరణ పొందినట్లు కంపెనీ తెలిపింది.
మెటా అందించిన ఈ లేటెస్ట్ మూస్ వాయిస్ ట్రాన్స్ క్రైబ్ ఏఐ మోడల్ చాలా భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ మరియు మలయాళం లాంగ్వేజ్ లు ఉన్నాయి. అంటే దాదాపు అన్ని దక్షిణ భారత భాషలకు ఈ లేటెస్ట్ మెటా ఏఐ మోడల్ సపోర్ట్ చేస్తుంది.
ఈ లేటెస్ట్ మెటా మోడల్ లో ఉన్న మరో మంచి విషయం ఏమిటంటే, తెలుగు + ఇంగ్లిష్ మాట్లాడితే కూడా గుర్తిస్తుంది. ప్రస్తుతం మనం తెలుగులో మాట్లాడే మాటల్లో చాలా మాటలు అనుకోకుండా ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి. అందుకే, ఇందులో లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ కలిపి మాట్లాడితే కూడా గుర్తించే విధంగా తయారు చేశారు. దీనిని కోడ్ స్టిచ్చింగ్ అంటారు మరియు మెటా మోడల్ దీన్ని కూడా ఈజీగా రియల్ టైం లో గుర్తిస్తుంది.
ఉదాహరణకు ‘రేపు మనకు మీటింగ్ ఉంది’ లేదా ‘ మార్నింగ్ వాకింగ్ కి వెళ్దామా’ అని చెప్పినా కూడా ఇది గుర్తించి టెక్స్ట్ రూపంలో అందిస్తుంది.
మెటా ఇప్పటికే Muse Spark వంటి AI మోడల్స్ ద్వారా తన AI ఎకో సిస్టమ్ ను విస్తరిస్తోంది. మూస్ వాయిస్ ట్రాన్స్ క్రైబ్ ఆ ఎకో సిస్టమ్ లో “AI కి వినే సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే మోడల్ గా చూడవచ్చు.