కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిధారులకు గుడ్ న్యూస్…!

కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిధారులకు గుడ్ న్యూస్…!
HIGHLIGHTS

దేశంలో ఎక్కడి నుండైనా మీ రేషన్ తీసుకోవచ్చు

ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుకోవచ్చు

రేషన్ షాప్ లోని సరుకు వాటి ధరలు కూడా మొబైల్లోనే చూడవచ్చు

దేశంలో ఎక్కడి నుండైనా మీ రేషన్ తీసుకోవచ్చు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ, రేషన్ ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి, మీ దగ్గరలో రేషన్ షాప్ ఎక్కడుంది లేదా పనివేళలు ఏంటి లేదా ఎటువంటి సరుకు మీ దగ్గరలోని రేషన్ షాపులో ఇస్తున్నారు, అనే విషయాలను ప్రజలకు క్లియర్ గా తెలియచేయడానికి ఒక APP ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రేషన్ లభిధారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. ఈ యాప్ రేషన్ కార్డు లబ్ధిదారులకు వరంలా మారుతుంది.

రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.    

 మేరా రేషన్ మొబైల్ యాప్

ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత,  మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo