Maha shivaratri 2025 best wishes and images to send loved ones
Maha shivaratri 2025 పర్వదినం వచ్చేసింది. తెలుగు వారికి అత్యంత ప్రియమైన పండుగలలో ‘మహాశివరాత్రి’ కూడా ఒకటి. ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులు కావడానికి మహా శివరాత్రి నాడు ఉపవాసం మరియు శివసన్నిధిలో సమయం గడపడం మంచిదని భావిస్తారు. అంతేకాదు, ఈ పండుగ అందరికి సుఖ సొంతోషాలు తీసుకురావాలని కూడా ఆ ఈశ్వరుని అర్థిస్తారు. అందుకే, ఈ పండుగ నాడు మీ ప్రియమైన వారికి పంపదగిన బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ ఇమేజెస్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.
ఓం నమః శివాయ! మీకు మరియు మీ కుటుంబానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలి!
అతి పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున, ఆ శివుడు మీకు జ్ఞానాన్ని మరియు శక్తిని ప్రసాదించుగాక, శుభ శివరాత్రి!
ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు!
శివయ్య లేని చోటేది, మీ మనసులో, నా మనసులో, మన అందరి మనస్సులో ఆయన కొలువై ఉన్నాడు. ఈ శివరాత్రి ఆ శివుని ప్రేమకు మీరు పాత్రలు కావాలని ఆశిస్తూ, మాహాశివరాత్రి 2025 శుభాకాంక్షలు.
ఈ శివరాత్రి పర్వదినాన మీ ఇంట శాంతి మరియు సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి 2025 శుభాకాంక్షలు.
ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండటం వలన మీ పాపాలు తొలగిపోవాలని మరియు మీకు మోక్షం కలగాలని కోరుకుంటూ, మహాశివరాత్రి శుభాకాంక్షలు!
శివయ్య నామస్మరణతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, మీకు మహాశివరాత్రి 2025 శుభాకాంక్షలు.!
Also Read: Jio Hotstar ఉచితంగా ఆఫర్ చేసే జియో మరియు ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ ఇవే.!