10 వేలకే 5G ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

HIGHLIGHTS

Lava కేవలం 10,000 రూపాయల ధరలోనే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది

Lava లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G

చవక ధరకే 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడం చాలా గొప్ప పరిణామం

10 వేలకే 5G ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

ఇండియన్ మొబైల్ బ్రాండ్ Lava కేవలం 10,000 రూపాయల ధరలోనే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) నుండి Lava లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G మొబైల్ ను కేవలం 10 వేల రూపాయల ధరలో ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇండియాలో 5G సేవలు మొదలవుతున్న వేళ చవక ధరకే 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడం చాలా గొప్ప పరిణామం. ఈ ఫోన్ దీపావళి పండుగ నాటికీ సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుందని కంపెనీ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఇక యాతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది.

 Lava Blaze 5G: ధర

వాస్తవానికి, ప్రస్తుతానికి ఈ లావా బ్లేజ్ 5G ఫోన్ ధర పైన క్లారిటీ లేదు. అయితే, ఈ ఫోన్ ను భారతీయ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకొని తీసుకొని వస్తోంది కాబట్టి, సుమారు 10,000 రూపాయల ధరలో ఈ ఫోన్ రేటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ దీపావళి పండుగ నాటికి Pre-Order లకు అందుబాటులో ఉంటుందని లావా ప్రకటించింది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo