కార్తికేయ 2: ఆగని హిందీ కలక్షన్స్ సునామీ..!!

HIGHLIGHTS

కార్తికేయ 2 ఇటు తెలుగు రాష్టాలతో పాటుగా నార్త్ లో కూడా గొప్ప కలక్షన్స్ సాధించి బ్లాక్ బాస్టర్ సినిమా

హిందీ వెర్షన్ కలక్షన్స్ ఇప్పటికీ దూసుకుపోతున్నాయి

కార్తికేయ 2 హిందీ వెర్షన్ 30 కోట్ల కలక్షన్ లను సాధించినట్లు తెలుస్తోంది

కార్తికేయ 2: ఆగని హిందీ కలక్షన్స్ సునామీ..!!

కార్తికేయ 2 ఇటు తెలుగు రాష్టాలతో పాటుగా నార్త్ లో కూడా గొప్ప కలక్షన్స్ సాధించి బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ కలక్షన్స్ ఇప్పటికీ దూసుకుపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మార్కెట్ వర్గాలు వేస్తున్న లెక్కలు, అంచనాలతో పాటుగా కొన్ని నివేదికల ప్రకారం , కార్తికేయ 2 హిందీ వెర్షన్ 30 కోట్ల కలక్షన్ లను సాధించినట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, ఈ సినిమా ఇప్పటికీ రికార్డు స్థాయి కలక్షన్లను రాబట్టటం చూస్తుంటే ఈ నంబర్ ఊహించనంత పెద్ద నంబర్ చేరుకోవచ్చని కూడా ఊహిస్తున్నారు.        చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా మరియు అనుపమా పరమేశ్వరన్ హీరో ఇన్ గా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే ప్రేక్షకుల ఆదరాభిమానాలను చోరగొంది మరియు అందరి ప్రశంసలు అందుకుంది.

ఎటువంటి హిప్ లేదా ప్రమోషన్ వంటివి లేకుండా సింపుల్ గా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రజల నుండి స్పందను అందుకొని అమాంతంగా దూసుకుపోయింది. ప్రస్తుతం కార్తికేయ 2 హిందీ వెర్షన్ కలెక్షన్లు నిలకడగా కొనసాగుతున్నా, త్వరలో రాబోతున్న 'బ్రహ్మాస్త్రం' ఎఫక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo