JioPhone 5G: లీకైన జియోఫోన్ 5జి ఫీచర్లు ..!
ఇండియాలో 5G ఒరవడి ఈ సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం వుంది
రిలయన్స్ జియో ఈ రేస్ లో ముందు ఉండవచ్చు
జియో 5g సర్వీస్ తో పాటుగా Jio Phone 5G కూడా తీసుకురావవచ్చు
ఇండియాలో 5G ఒరవడి ఈ సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం వుంది మరియు రిలయన్స్ జియో ఈ రేస్ లో ముందు ఉండవచ్చు. ఎందుకంటే, రిలయన్స్ జియో 5G సర్వీస్ ను ఇండియాలో త్వరగా ప్రవేశపెట్టడానికి టెస్టింగ్స్ లో నిమగ్నమై ఉండడమే కాకుండా, అదే సమయంలో వినియోగదారులు ఉత్తమ 5G వేగాన్ని పొందుతారని కూడా వాగ్దానం చేస్తోంది. అయితే, ఇవన్నీ ఇప్పటి వరకూ మనకు తెలిసిన విషయాలు కాగా, ఇప్పుడు ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. జియో తన 5g సర్వీస్ తో పాటుగా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Jio Phone 5G తీసుకురావడానికి కూడా పనిచేస్తున్నట్లు ఒక రిపోర్ట్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ ద్వారా వెల్లడించింది.
SurveyAndroid Central ముందుగా జియోఫోన్ 5G గురించి ఎక్స్ క్లూజివ్ నివేదిక అందించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, జియో 5G సర్వీస్ ప్రకటించే సమయానికి బడ్జెట్ ధరలో JioPhone 5G ని కూడా ప్రకటించవచ్చు. అంతేకాదు, ఈ 5G ఫోన్ యొక్క స్పెక్స్ ను కూడా ఈ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ చాలానే లభిస్తున్నా కూడా అవన్నీ కూడా 15 వేల కంటే ఎక్కువ ధరలో ఉండగా, జియో మాత్రం JioPhone 5G అందరికి అందుబాటులో రూ.9,000 నుండి రూ.12,000 మధ్యలో ఉంచవచ్చని కూడా ఈ రిపోర్ట్ తెలిపింది.
జియోఫోన్ 5జి స్పెక్స్ విషయానికి వస్తే, క్వాల్కమ్ బడ్జెట్ 5G చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 480 5G శక్తితో ఉంటుందని నివేదిక చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఇది N3, N5, N28, N40 మరియు N78 బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ భారతదేశం అంతటా 5G నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే, 4GB మరియు 32GB స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉండవచ్చు. అంటే, గతంలో వచ్చిన Jio Phone Next తో పోలిస్తే పెద్ద మార్పులే ఈ ఫోన్ లో చూడవచ్చని మరియు కెమెరాల పరంగా పెద్ద మార్పులు లేకపోవచ్చని ఈ నివేదిక వెల్లడించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile