జియో 5G నెట్వర్క్ వచ్చేసింది..మరి జియో 5G ఫోన్ ఎప్పుడొస్తుంది.!

HIGHLIGHTS

Jio 5G సర్వీస్ లను ప్రారంభించింది

దసరా పండుగ రోజు ఢిల్లీలో జియో తన 5G బీటా ట్రయల్‌ను ప్రారంభించింది

త్వరలోనే తన 5G Phone ను తీసుకురావడానికి జియో కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది

జియో 5G నెట్వర్క్ వచ్చేసింది..మరి జియో 5G ఫోన్ ఎప్పుడొస్తుంది.!

రిలయన్స్ జియో తన ఇటీవలి అన్యువల్ జనరల్ మీటింగ్ నుండి ప్రకటించిన విదంగా Jio 5G సర్వీస్ లను ప్రారంభించింది. అక్టోబర్ 5 దసరా పండుగ రోజు ఢిల్లీలో జియో తన 5G బీటా ట్రయల్‌ను ప్రారంభించింది. ఈ Jio True 5G ఆఫర్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసి పట్టణాల్లోని యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే, ప్రతిఒక్కరి చూపు కూడా JioPhone 5G వైపుకు మళ్ళాయి. వాస్తవానికి, త్వరలోనే తన 5G Phone ను తీసుకురావడానికి జియో కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫోన్ గురించి ఆన్లైన్లో ఎటువంటి రూమర్లు మరియు సంచారం అందుబాటులో వుందో తెలుసుకుందామా.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jiophone 5G

జియోఫోన్ 5G ని వివిధ స్క్రీన్ సైజ్, స్పెక్స్ మరియు స్టోరేజ్ అప్షన్లలో జియో తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంటే, ఈ JioPhone 5G వేరియంట్స్ ధరలు బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంటాయని ఊహిస్తున్నారు. అయితే, Jio యొక్క మునుపటి ఫోన్‌ లతో పోలిస్తే హార్డ్‌వేర్ మరియు డిజైన్ పరంగా చాలా బిన్నంగా మరియు బిగ్ అప్ గ్రేడ్ లను కలిగి ఉంటాయని ఆ పరిశోధనా సంస్థ అంచనా వేసింది. కొన్ని నివేదికలు జియో 5G నెట్వర్క్ మరింతగా విస్తరించే నాటికీ Jiophone 5G ని తీసుకువస్తుందని చెబుతున్నాయి.    

అలాగే, Jiophone 5G యొక్క అంచనా ధరలను గురించి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కొంత సంచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం, Jiophone 5G రూ. 8,000 నుండి రూ. 12,000 మధ్య అందుబాటులోకి రావచ్చని తెలిపింది. అయితే, జియో తన 5G ఫోన్ ను 5G నెట్ వర్క్ ను మరింతగా విస్తరించిన తరువాత తీసుకురావడానికి చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Jiophone 5G: లీక్డ్ స్పెక్స్

జియోఫోన్ 5జి స్పెక్స్ విషయానికి వస్తే, క్వాల్కమ్ బడ్జెట్ 5G చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 480 5G శక్తితో ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఇది N3, N5, N28, N40 మరియు N78 బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ భారతదేశం అంతటా 5G నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే, 4GB మరియు 32GB స్టోరేజ్ తో ఉంటుంది.

ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉండవచ్చు. అంటే, గతంలో వచ్చిన Jio Phone Next తో పోలిస్తే పెద్ద మార్పులే ఈ ఫోన్ లో చూడవచ్చు. JioPhone 5G వెనుక 13-మెగాపిక్సెల్ ప్రైమరీ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉండవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo