ఆన్లైన్ లో లీకైన Jio Phone Next ప్రైస్: ధర ఎంతంటే..!

HIGHLIGHTS

ఆన్లైన్లో లీకైన JioPhone Next ధర

ఊహించనంత తక్కువ ధరకే వస్తోంది

JioPhone Next గురించి కొత్త విషయాలు

అతితక్కువ ధరకే JioPhone Next ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటనైతే వచ్చింది. కానీ, ఈ అప్ కమింగ్ జియో ఫోన్ ధర ఎంత ఉండబోతోంది? అనే ప్రశ్న గత కొంతకాలంగా అందరిని పట్టి పీడిస్తోంది. అయితే, ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన ఒక సమాచారం ఈ అప్ కమింగ్ ఫోన్ రేటు ఎంత ఉంటుందని సూచించింది. అంతేకాదు, ఇప్పటికే ఈ ఫోన్ సెప్టెంబర్ 10 నుండి అమ్మకానికి వస్తుందని కూడా వెల్లడయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 13MP సింగిల్ కెమెరా ఉన్నట్లు కూడా లీక్స్ కన్ఫర్మ్ చేశాయి. మరి ఈ ఫోన్ యొక్క కొత్త విషయాలు ఏమిటో చూద్దామా..!

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ చేసిన ట్వీట్ ప్రకారం, JioPhone Next ధర రూ. 3,499 కావచ్చని చెబుతున్నారు, భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్ అమ్మకం సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. ముందుగా వచ్చిన లీక్స్ కూడా ఈ ఫోన్ రూ.3,500 నుండి రూ.4,500 మధ్యస్థంగా ఉండవచ్చని సూచించాయి. అయితే, ఈసారి మాత్రం క్లియర్ ప్రైస్ డిటైల్స్ ని లీక్స్ టిప్‌స్టర్ ద్వారా వెల్లడించినట్లు ఊహిస్తున్నారు.

ఇదే కనుక నిజమైతే, JioPhone Next ప్రపంచంలో అత్యంత చవకైన 4G స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుంది.

JioPhone Next: స్పెక్స్

ఈ జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అత్యంత చవకధరకే లభించనున్న స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అంటే, ప్రస్తుతం మర్కెట్లో ఉన్న తక్కువ ధరకే లభిస్తున్న 4G స్మార్ట్ కంటే కూడా ఈ ఫోన్ రేట్ మరింత తక్కువగా ఉండాలి. అందుకే, ఈ ఫోన్ రూ.3,500 నుండి రూ. 4,500 రూపాయల మధ్య ఉండవచ్చని ఊహిస్తున్నారు.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ అనేది గూగుల్ క్లౌడ్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫుల్లీ ఫీచర్డ్ స్మార్ట్‌ఫోన్. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు ఈ JioPhone Next లో చేర్చబడ్డాయి. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది. జియోఫోన్ నెక్స్ట్ 13 MP స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుందని కూడా ఊహిస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో కూడా వస్తుంది.

ఈ కొత్త సరసమైన 4 జి స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంకా 2G నెట్వర్క్ కే  పరిమితపరిమితమైన 300 మిలియన్ల వినియోగదారులను 4జి నెట్‌వర్క్‌కు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. నెక్స్ట్ లెవల్ చందాదారుల వృద్ధి కోసం రిలయన్స్ ఎంట్రీ లెవల్ వినియోగదారుల వైపు మొగ్గు చూపుతోందని కూడా వెల్లడించారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :