JioPhone యొక్క బీటా టెస్టింగ్ స్టార్ట్ , యూజర్స్ కి అతి త్వరలో అందుబాటు….!!!
రిలయన్స్ జియో పాపులర్ ఫీచర్ ఫోన్ యొక్క బీటా టెస్టింగ్ నిన్నటినుండి మొదలయింది . ఇది జియో ఫోన్ యొక్క మొదటి బ్యాచ్ . రిలయన్స్ జియో చైర్మన్ ముఖేష్ అంబానీ స్వయంగా దీని గురించి తెలిపారు . ఫోన్ బీటా టెస్టింగ్ లో ఈ ఫోన్ కొంతమంది యూజర్స్ కి మాత్రమే లభిస్తుంది అంటే దీని అర్ధం ఇది అప్పుడే మార్కెట్ లోకి వచ్చేసిందని కాదు . ఇది వినియోగదారులకు సెప్టెంబర్ లో అందుబాటులో ఉంటుంది . ప్రస్తుతం ఈ ఫోన్ JIO ఉద్యోగుల కోసం అందుబాటులో ఉంది . ప్రస్తుతం ఏ ఫీచర్ ఫోన్ లో చూడలేని అనేక ఫీచర్స్ జియోఫోన్లో ఉన్నాయి. ఈ ఫీచర్స్ లో 4G VoLTE, ఇంటర్నెట్, వాయిస్ , సెర్చ్ , మల్టీమీడియా యాప్ , మిర్రరింగ్ మొదలైనవి. అయితే సామాన్య మానవులు ఈ ఫోన్ పొందాలంటే వారు కొద్దిగా వెయిట్ చేయాలి . 24 ఆగష్టు నుంచి బుకింగ్ మొదలవుతుంది , డిసెంబర్ లో మీ చేతికి వస్తుంది . ఫోన్ బుకింగ్ కి మీకు ఆధార్ కార్డ్ అత్యవసరం . వాయిస్ సెర్చ్ ఆప్షన్ వల్ల ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది . మీరు ఫోన్ లో వాయిస్ సెర్చ్ తో ఎవరికైనా మెసేజ్ పంపవచ్చు, మ్యూజిక్ వినవచ్చు .
Surveyఎన్నడూ చూడని అమేజింగ్ డిస్కౌంట్ ₹4,999 ధర గల బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ జస్ట్ ₹694 లో …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile