జియో టాప్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితంగా పొందవచ్చు..!!

జియో టాప్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితంగా పొందవచ్చు..!!
HIGHLIGHTS

మంచి లాభాలను తీసుకొచ్చే జియోఫోన్ ఆఫర్

రెండు సంవత్సరాల కంప్లీట్ అన్లిమిటెడ్ సర్వీస్

హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి

మంచి లాభాలను తీసుకొచ్చే జియోఫోన్ ఆఫర్ రిలయన్స్ జియో 2021 లో ప్రకటించింది. ఈ జియోఫోన్ అఫర్ ద్వారా రెండు సంవత్సరాలు కంప్లీట్ అన్లిమిటెడ్ సర్వీస్ తో పాటుగా జియోఫోన్ ను కూడా ఉచిత ప్రకటించింది. తక్కువ ధరలో కొత్త 4G ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక అవుతుంది. వాస్తవానికి, ఇప్పటికీ 2G వాడుతున్న కస్టమర్లకు 4G సర్వీస్ ను అందించే లక్ష్యంలో భాగంగా జియో ఈ అఫర్ తీసుకొచ్చినట్లు పేర్కొంది. దీనితో పాటుగా ముందు నుండే  జియోఫోన్ ను వాడుతున్న కస్టమర్ల కోసం కూడా టాప్ ప్లాన్ ని అందించింది. 

జియోఫోన్ ఆఫర్

రిలయన్స్ జియో లేటెస్ట్ జియోఫోన్ ను పూర్తి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

పైన తెలిపిన ఈ ప్రయోజనాలలతో  కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ప్రయోజనాలను కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు నెలకు 2GB డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo