Install App Install App

జియో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్: ఉచితంగా OTT సర్వీస్ తో పాటుగా అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Dec 2021
HIGHLIGHTS
  • ప్రముఖ OTT ప్లాట్ఫారం డిస్నీ+ హాట్ స్టార్ ఉచిత సర్వీస్ తీసుకువచ్చే ప్లాన్స్

  • Jio కస్టమర్లకు ఎటువంటి పరిమితి లేకుండా డిస్నీ+ హాట్ స్టార్ యాక్సెస్

  • Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది

జియో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్: ఉచితంగా OTT సర్వీస్ తో పాటుగా అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి
జియో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్: ఉచితంగా OTT సర్వీస్ తో పాటుగా అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి

రిలయన్స్ జియో డిసెంబర్ 1 నుండి తన రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే, ప్రముఖ OTT ప్లాట్ఫారం డిస్నీ+ హాట్ స్టార్ ఉచిత సర్వీస్ తీసుకువచ్చే ప్లాన్స్ ను నిలిపి వేసింది. నిన్నటి వరకూ కేవలం ఒక్క ప్లాన్ ను మాత్రమే అందిస్తుండగా ఇప్పుడు దీన్ని నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ కు వర్తింప చేసింది. అంటే, జియో తీసుకొచ్చిన ఒక 4  కొత్త ప్లాన్స్ డిస్నీ+ హాట్ స్టార్ కి అన్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ను తీసుకువస్తాయి.

ఈ ప్లాన్స్ కేవలం 1 నెల వ్యాలిడిటీ మొదలుకొని 1 సంవత్సరం వ్యాలిడిటీ వరకు అందించింది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసే జియో కస్టమర్లకు ఎటువంటి పరిమితి లేకుండా డిస్నీ+ హాట్ స్టార్ యాక్సెస్ లభిస్తుంది. మరి ఆ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకుందామా..!

1.రూ.601 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది ముందుగా అందుబాటులో ఉన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ వంటి ప్రయోజాలనే ఇస్తుంది. దీనితో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 3జిబి హై స్పీడ్ డేటా లాభాలను 28 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 84 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

2.రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది ముందుగా అందుబాటులో ఉన్న రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ వంటి ప్రయోజాలనే ఇస్తుంది. దీనితో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2జిబి హై స్పీడ్ డేటా లాభాలను 56 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 112 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

3.రూ.1066 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది ముందుగా అందుబాటులో ఉన్న రూ.888 ప్రీపెయిడ్ ప్లాన్ వంటి ప్రయోజాలనే ఇస్తుంది. దీనితో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2 జిబి హై స్పీడ్ డేటా లాభాలను 84 రోజుల వ్యాలిడిటీ తో తీసుకువస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యాక్సెస్ లభిస్తుంది. 2GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 168 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

4. రూ.3119 వన్ ఇయర్ ప్లాన్ తో కూడా ఈ డిస్నీ+ హాట్ స్టార్ VIP ప్రయోజనాన్ని జతచేసింది.

ఇది ముందుగా అందుబాటులో ఉన్న రూ.2,599 ప్రీపెయిడ్ ప్లాన్ వంటి ప్రయోజాలనే ఇస్తుంది. ఇది పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 499 రుపాయల విలువగల Disney+ Hotstar VIP సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని Jio ప్లాన్స్ కోసం ఇక్కడ Click చేయండి

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Jio latest best plans with free Disney plus hot star one year subscription
Tags:
Jio reliance jio jio best plans jio 5g jio 4g jio prepaid plans jio Disney+ hotstar రిలయన్స్ జియో
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status