జియోఫోన్ యూజర్ల కోసం బెస్ట్ ప్లాన్ ప్రకటించిన జియో
జియోఫోన్ వినియోగదారుల కోసం జియో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్ ను ప్రకటించింది
ఈ ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీ ఆఫర్ చేస్తుంది
ఈ ప్లాన్ ప్లాన్ కేవలం జియోఫోన్ వాడుతున్న యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది
జియోఫోన్ వాడుతున్న వినియోగదారుల కోసం జియో లేటెస్ట్ బెస్ట్ ప్లాన్ ను ప్రకటించింది. అదే రూ. 899 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ప్లాన్. మీరు తక్కువ ఖర్చులో ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్ కోసం చూస్తున్న జియోఫోన్ యూజర్ కనుక అయితే ఈ ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ డేటా తో సహా మరిన్ని ప్రయోజాలను ఆఫర్ చేస్తుంది.
Surveyఈ ప్లాన్ ప్లాన్ కేవలం జియోఫోన్ వాడుతున్న యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. మీరు కనుక జియోఫోన్ యూజర్ అయితే, మీకు నెల నెల రీఛార్జ్ చేసే పనిలేకుండా ఈ ప్లాన్ తో 336 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజానాలను అందుకోవచ్చు. ఈ ప్లాన్ ను JIO-ALL-IN-ONE కేటగిరిలో అందించింది.
జియో రూ.899 ప్లాన్ ప్రయోజనాలు
జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ రూ.899 ప్లాన్ ప్రయోజాల గురించి చూసినట్లయితే, ఈ ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల సమయాన్ని 28 రోజులకు కుదిస్తుంది, జియో రెగ్యులర్ ఒక నెల రీఛార్జ్ మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్లాన్ తో 28 రోజుల కు 2GB డేటా చొప్పున 12 నెలలకు 24 GB(2GB x 12నెలలు) హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, నెలకు 50 SMS చొప్పున 12 నెలలకు (28 డేస్ x 12 సైకిల్స్) ఉచిత SMS సౌకర్యాన్ని మరియు అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని కూడా ఇస్తుంది.
ఇక జియోఫోన్ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లభించే మరొక ప్లాన్ విషయానికి వస్తే, రూ.91 ప్రీపెయిడ్ ప్లాన్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS సర్వీసులను అందించే 28 రోజుల బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది.
Jio Rs.91 Plan
ఇప్పుడు కొత్తగా Jio తీసుకొచ్చిన 91 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందించే చవక ప్లాన్ గా నిలుస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 100MB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ మరియు 200 MB అదనపు డేటాను కూడా అఫర్ చేస్తుంది.ఇది కూడా కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile