జియో ధమాకా అఫర్: రీఛార్జ్ అయిపోయినా నెట్ వాడుకోవచ్చు

Updated on 19-Jul-2021
HIGHLIGHTS

జియో కస్టమర్ల కోసం ధమాకా అఫర్

రీఛార్జ్ అయిపోయినా నెట్ వాడుకునే కొత్త ఫెసిలిటీ

మై జియో యాప్ ద్వారా ఉపయోగించుకోవాలి

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ధమాకా అఫర్ ప్రకటించింది. రీఛార్జ్ అయిపోయినా నెట్ వాడుకునే విధంగా కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. రీఛార్జ్ ముగిసిన తరువాత అత్యవసర సమయంలో ఉపయోగపడేలా ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీని జియో తీసుకొచ్చింది. హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన లేదా రీఛార్జ్ ముగిసిన తరువాత ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ ద్వారా డేటాని లోన్ గా తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీని మై జియో యాప్ ద్వారా ఉపయోగించుకోవాలి.                                                                                                

అనుకోని కారణాల వాల్ల రీఛార్జ్ చేయలేక పోయిన సమయంలో జియో కస్టమర్లకు ఈ ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ ద్వారా నిరంతర డేటా అవసరాన్ని తీర్చేలా ఉంటాయి. మై జియో యాప్ నుండి ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ తో ఎమర్జెన్సీ డేటా ఎలా పొందాలో  ఈ క్రింద దశలలో చూడవచ్చు.

జియో ఎమర్జెన్సీ డేటా ఎలా పొందాలి?

మై జియో యాప్ తెరిచి మెనూ లోకి వెళ్ళండి

ఇందులో మొబైల్ సర్వీస్ లో ఉన్న 'ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ' ని ఎంచుకోండి

ఇక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్ బ్యానర్ పైన నొక్కండి

ఇక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్ బ్యానర్ లోని 'ప్రొసీడ్' పైన నొక్కండి

తరువాత 'గెట్ ఎమర్జెన్సీ డేటా' అప్షన్ ఎంచుకోండి

ఇక్కడ 'యాక్టివేట్ నౌ' పైన నొక్కండి

అంటే, ఈ స్టెప్స్ తరువాత మీ ఎమర్జెన్సీ డేటా లోన్ బెనిఫిట్ మీ జియో నంబర్ పైన యాక్టివేట్ చేయబడుతుంది.

ఎన్ని సార్లు మీ ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకోవచ్చు?

మీరు మీ జియో నంబర్ పైన ఈ ఎమర్జెన్సీ డేటా లోన్ ను 5 ఎమర్జెన్సీ డేటా ఫ్యాక్స్ వరకూ తీసుకోవచ్చు. ఒక్కొక్క ప్యాక్ మీకు రూ.11 తో మొత్తం 5 ఫ్యాక్స్ కు గాను 55 రూపాయల వరకూ డేటాని పొందవచ్చు. అదీకూడా వెంటనే పేమెంట్ చేయకుండానే ఈ 5 ఫ్యాక్స్ వరకూ వాడుకోవచ్చు.  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :