ప్రస్తుతం కేవలం పరిక్షదశలో వున్నా జియో గిగా ఫైబర్ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. ముఖేష్ అంభానీ నేతృత్వంలోని, రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఇక 1,600 సిటీలలో తన కార్యకలాపాలను సాగించనున్నట్లు, ముందుగా ET Telicom తన నివేదికలో పేర్కొంది. ఇదే గనుక నిజమైతే అతి త్వరలోనే అత్యంత వేగమైన హోమ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ప్రతి ఒక్కరు అందుకోనున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
ప్రస్తుతం, చాలా మంది కూడా స్మార్ట్ ఫోనులు, స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ డివైజులు వాడాటానికి అలవాటుపడిపోయరు. వీటికి ముఖ్యంగా, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమవుతుంది. అలాగే, అతితక్కువ ధరలకే 4K స్మార్ట్ టీవీలను మార్కెట్లో అమ్మడంతో ఈ వినియోగం చాలావరకు పెరిగింది. వీటన్నిటికీ గొప్ప స్పీడుతో ఇంటర్నెట్ అందుకోవాలంటే, ఈ జియో గిగా ఫైబర్ అందించే FTTH సర్వీసులు సరిగ్గా సరిపోతాయి.
ఇది సాధారణ బ్రాడ్ బ్యాండ్ కంటే 20 నుండి 100 రేట్ల అధికమైన వేగంతో పనిచేస్తుంది కాబట్టి, ఎటువంటి అంతరాయం మరియు ఆలస్యం లేకుండా గొప్ప స్పీడుతో సర్వీసులను అందుకోవచ్చు. అధనంగా, ముందుగా ప్రకటించిన విధంగా, జియో తక్కువ రేటుతో తన సేవలను అందచనున్నట్లు ప్రకటించింది, కాబట్టి దీని ప్లాన్స్ కూడా తక్కువ ధరతో రావచ్చని అంచనా వేస్తున్నారు.