OTT లో ఈరోజే రిలీజైన జయమ్మ పంచాయితీ.!!

HIGHLIGHTS

'జయమ్మ పంచాయతీ' ఈరోజు OTT లో రిలీజ్ అయ్యింది

కథ మరియు సుమ యాక్టింగ్ తో పాటుగా పూర్తిగా పల్లెటూరి వాతావరణం ఆకట్టుకునే అంశాలు

ఈ హై డ్రామా మూవీ పలువురి ప్రశంసలు అందుకుంది

సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయతీ' ఈరోజు OTT లో రిలీజ్ అయ్యింది. మే 6 న సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కథ మరియు సుమ యాక్టింగ్ తో పాటుగా పూర్తిగా పల్లెటూరి వాతావరణం ఆకట్టుకునే అంశాలు. అంతేకాదు, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కూడా సుమ యాక్టింగ్ గురించే ఎక్కువగా మాట్లాడారు. ఈ సినిమా ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యింది.

బలగ ప్రకాశ్ నిర్మాతగా కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై డ్రామా మూవీ పలువురి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా, సుమ కనకాల నటన ఈ చిత్రానికి ప్రాణం పోసినట్లు పలువురు ప్రముఖులు కితాబు పలికారు. ఈ సినిమాలో దినేష్ మరియు షాలినీ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే కథ మొత్తంగా గ్రామీణ వాతావరణంలోనే సాగుతుండడమే కాకుండా కావాలి;కావాల్సినంత కామెడీ మరియు డ్రామా ఈ సినిమాలో చూడవచ్చు.

ఇక కథ విషయానికి వస్తే, శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో హాయిగా జీవించే ఒక సగటు కుటుంబంలో కుటుంబ పెద్ద (జయమ్మ భర్త) కి హఠాత్తుగా జబ్బు చేయడంతో జరిగే పరిణామాలు గురించి చెబుతుంది ఈ సినిమా. తన భర్త కోసం జయమ్మ(సుమ) పంచాయితీ పెద్దలను ఆశ్రయిస్తుంది. ఆ తరువాత ఏమిజరిగింది అనేది ఈ చిత్రం. సినిమా థియేటర్లలో చూడలేక పోయామనే వారు ఈ సినిమాను OTT లో చూడవచ్చు. 'జయమ్మ పంచాయతీ' మూవీ జూన్ 14, అంటే ఈరోజు నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :