India-Pak Conflict: దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత యాంటీ డ్రోన్ UAS గ్రిడ్.!
పాకిస్తాన్ దొంగచాటుగా అమాయకులైన ప్రజల నివాసాలు టార్గెట్ చేసుకొని బాంబుల వర్షం కురిపించింది
జమ్మూ ఎయిర్ పోర్ట్ మరియు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ప్రాంతాల ను టార్గెట్ చేసుకుని దాడులు
భారత రక్షణ కవచమైన UAS Grid మరియు Air Defense systems ఈ దాడులను తిప్పి కొట్టింది
India-Pak Conflict: పహాల్గమ్ లో ఉద్రవాదులు అటాక్ కు దీటుగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బకు పాకిస్తాన్ కి చుక్కలు కనిపించాయి. అయితే, యుద్ధ నీతి లో ఏదైతే నిషేధమే అదే దారిని ఎంచుకున్న పాకిస్తాన్ దొంగచాటుగా అమాయకులైన ప్రజల నివాసాలు టార్గెట్ చేసుకొని బాంబుల వర్షం కురిపించింది. అంతటితో ఆగకుండా భారత్ పై అనేక కుట్రలు చేస్తోంది. జమ్మూ ఎయిర్ పోర్ట్ మరియు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ప్రాంతాల ను టార్గెట్ చేసుకుని దాడులు చేసింది. అయితే, భారత్ రక్షణ కవచమైన UAS Grid మరియు Air Defense systems ఈ దాడులను తిప్పి కొట్టింది. పాకిస్తాన్ డ్రోన్స్ మరియు మిస్సైల్స్ ను S-400 మిస్సైల్ ఉపయోగించి ఆకాశంలోనే పేల్చి వేసింది
India-Pak Conflict:
పాకిస్తాన్ దాడులు తిప్పికొట్టిన UAS Grid మరియు Air Defence systems అనేది భారతదేశ రక్షణ కోసం నిర్మించిన ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ. UAS (Unnamed Aerial System) గ్రిడ్ మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టం అనేది, భారత గగనతలం లేదా భూ సరిహద్దులోకి వచ్చే ఏవైనా శత్రు డ్రోన్‌లు, క్షిపణులు మరియు వైమానిక ముప్పులను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి మరియు నిలువరించడానికి రూపొందించబడిన అధునాతన, మల్టీ – లేయర్ సాంకేతిక సమాహారం. ప్రస్తుత దాడుల నేపథ్యంలో ఈ సిస్టమ్ దేశరక్షణలో గొప్ప సేవలు అందిస్తోంది.
ఈ సిస్టం ఎలా పని చేస్తుంది?
ముందుగా, ఈ వ్యవస్థ శత్రువు డ్రోన్ లేదా క్షిపణి వంటి వైమానిక ముప్పు ఏదైనా ఉంటే గుర్తించి వాటిని ట్రాక్ చేస్తుంది. ఇది అధునాతన రాడార్లు మరియు ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్ల నెట్‌వర్క్ ద్వారా 10కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం వరకూ ఉన్న గగనతలాన్ని నిరంతరం స్కాన్ చేస్తుంది. అంతేకాదు, దాడి చేసే డ్రోన్ వేగం, పథం (ట్రెజక్టరీ) మరియు ఇతర ఫీచర్స్ గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
ఇందులో SIGINT లేదా (సిగ్నల్ ఇంటెలిజెన్స్) సామర్థ్యాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ వ్యవస్థ శత్రు సమాచార మార్పిడిని మరియు డ్రోన్ ను నియంత్రించే సంకేతాలను అడ్డగించి విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. శత్రు డ్రోన్‌ల కమాండ్ మరియు కంట్రోల్ లింక్ లను అంతరాయం కలిగించడానికి ఎలక్ట్రానిక్ జామర్‌లను మోహరిస్తారు. తద్వారా అవి నియంత్రణ కోల్పోయేలా లేదా క్రాష్ అయ్యేలా ఇది చేస్తుంది.
వైమానిక ముప్పు వర్గీకరణ తదుపరి కీలక దశ ఏమిటంటే, ఈ దశలో AI మరియు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలు సెన్సార్ డేటాను ప్రాసెస్ చేసి ముప్పులను ఆటోమాటిగ్గా వర్గీకరిస్తాయి. నిరపాయకరమైన వస్తువులు మరియు శత్రు డ్రోన్‌లు లేదా క్షిపణుల మధ్య తేడాను గుర్తించి, వేగవంతమైన మరియు మరింత ఖచ్చితమైన ప్రతిస్పందనకు దారిని సుగమం చేస్తాయి.
Also Read: Realme GT 7 లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ: అంచనా ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
అన్ని ఫిల్టర్స్ తర్వాత ముప్పు నిర్ధారించబడితే, ఈ వ్యవస్థ డ్రోన్ లను కొల్లట్రల్ డామేజ్ లేకుండా నిలిపివేయడానికి లేదా నాశనం చేయడానికి అధిక-శక్తి లేజర్ వ్యవస్థల వంటి లేయర్డ్ న్యూట్రలైజేషన్ ఆప్షన్ లను ఉపయోగిస్తుంది. ఈ పరిధిలో వైమానిక ముప్పులను ఎదుర్కొనే రాపిడ్-ఫైర్ తుపాకుల వంటి సాంప్రదాయ ఆయుధాలు కూడా ఉన్నాయి. చివరగా, క్షిపణి ఇంటర్‌సెప్టర్లు మరియు వాయు రక్షణ వ్యవస్థలు శత్రుదేశాల క్షిపణులను లేదా పెద్ద ఏరియల్ ప్లాట్ ఫారమ్ లను లక్ష్యంగా చేసుకునే ఛేదిస్తాయి.