icc World Cup 2027 Schedule released matches starts from 2 October 2026
World Cup 2027 Schedule ను ఈరోజు ICC అఫీషియల్ గా విడుదల చేసింది. మెన్స్ వరల్డ్ కప్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఈ వార్త పరమానందాన్ని ఇస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అందించిన షెడ్యూల్ ప్రకారం, మెన్స్ వరల్డ్ కప్ 2027 అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది మరియు నవంబర్ 21వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. భారత క్రికెట్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే న్యూస్ ఏమిటంటే క్వాలిఫై మ్యాచ్ తర్వాత జరిగే మొదటి మ్యాచ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగనున్నది.
2027 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2027 అక్టోబర్ 2 న ఈ టోర్నమెంట్ ప్రారంభమై, నవంబర్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఈసారి ప్రపంచ కప్ లో మొత్తం 14 జట్లు, 57 మ్యాచ్ లు మరియు 12 వేదికలు ఉంటాయి. 2003 తర్వాత తొలిసారిగా పురుషుల వన్డే ప్రపంచ కప్ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తోంది.
2027 ప్రపంచ కప్ లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. అందులో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్య దేశాలుగా నేరుగా టోర్నమెంట్ కి అర్హత సాధించాయి. మిగిలిన స్థానాలు ODI ర్యాంకింగ్స్ మరియు క్వాలిఫైయర్ ప్రక్రియ ద్వారా నిర్ణయించబడ్డాయి. చివరి కొన్ని స్థానాలకు మాత్రం క్వాలిఫైయర్ పోటీలు కీలకం కానున్నాయి.
క్వాలిఫైయర్ A, క్వాలిఫైయర్ B స్థానాల్లో ఏ దేశాలు వస్తాయో సంబంధిత క్వాలిఫికేషన్ ప్రక్రియ తర్వాత నిర్ణయమవుతుంది.
Also Read: Apple Pay: యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది .. కొత్త పేమెంట్ సర్వీస్ తెచ్చింది.!
2027 ప్రపంచకప్‌లో గత ప్రపంచకప్‌లతో పోలిస్తే ఫార్మాట్‌లో మార్పు ఉంది. అదేమిటంటే, మొదట 14 జట్లలో తక్కువ ర్యాంకింగ్ లో ఉన్న మూడు జట్లు సూపర్ సిరీస్ ఆడతాయి. ఈ మూడు జట్లు పరస్పరం ఒక్కోసారి ఆడి, అందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ దశలోకి వెళ్తుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ లో ఆరు జట్లు ఉంటాయి.
ప్రతి గ్రూప్ లోని టాప్-3 జట్లు, అలాగే రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో ఉన్న జట్లలో మెరుగైన జట్టు కలిపి మొత్తం ఏడు జట్లు సూపర్ 7 దశకు చేరతాయి. ఈ సూపర్ 7 లో ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ దశలో టాప్-4 లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.