ఒక స్మార్ట్ ఫోన్ ఎంచుకునే ముందుగా ఈ విషయాలు గుర్తుంచుకుంటే మంచిది

ఒక స్మార్ట్ ఫోన్ ఎంచుకునే ముందుగా ఈ విషయాలు గుర్తుంచుకుంటే మంచిది
HIGHLIGHTS

ఒక స్మార్ట్ ఫోన్ కొనే ముందు చాలా ఫీచర్లను పరిశీలిస్తాము

ర్యామ్ కూడా ధరను నిర్ణయిస్తుంది

ర్యామ్ మీ ఫోన్ బడ్జెట్ ను నిర్ణయించడంలో పాత్ర వహిస్తుంది

ఒక స్మార్ట్ ఫోన్ కొనే ముందు చాలా ఫీచర్లను పరిశీలిస్తాము. అయితే, ఒక స్మార్ట్ ఫోన్ కొనేముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలలో RAM కూడా ఒకటి. దీనికి కారణం ఏమిటో తెలుసా? వాస్తవానికి, మీ అవసరానికి తగిన ర్యామ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ఎంచుకోవడం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే, ర్యామ్ కూడా ధరను నిర్ణయిస్తుంది మరియు మీ ఫోన్ బడ్జెట్ ను నిర్ణయించడంలో పాత్ర వహిస్తుంది. అందుకే, మీకు అవసరానికి తగిన RAM తో ఒక స్మార్ట్ ఫోన్ ఎంచుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.              

RAM

ఉపయోగం : అధిక ర్యామ్ = మంచి మల్టి టాస్కింగ్

ఉదాహరణకు ర్యామ్ అంటే చేతులు అనుకోండి. మీ ఫోన్లో ఉండే అధిక ర్యామ్, మీ ఫోన్ ఎటువంటి సమయంలోనైనా చేయగల ఎక్కువ పని. స్మార్ట్ ఫోన్లలో ర్యామ్ ని సాధారణంగా గిగా బైట్లల్లో (GB) లలో కొలుస్తారు మరియు మీరు 1GB, 2GB, 3GB, 4GB, 6GB,8GB లేదా ఒక అతిపెద్ద 12GB RAM తో కూడా మీకు కావాల్సిన ఎంపికతో ఒక ఫోన్ పొందవచ్చు! మీకు ఎంత ర్యామ్ అవసరముంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, ఈ శీర్షిక మీకోసమే.

1జీబీ లేదా 2జీబీ  ర్యామ్

2జీబీ లేదా అంతకంటే తక్కువ ర్యామ్ కలిగిన స్మార్ట్ ఫోన్లు, వీటితో అడగకుండా / కాల్స్ మరియు సందేశాలను పంపడానికి మరియు ఇటువంటి కొన్ని ఇతర ఆన్లైన్ పనులను ఆశించవచ్చు, సాధారణ అవసరాలకు ఫోన్లను వాడేవారికి ఆదర్శంగా ఉంటాయి. ఈ ఫోన్లు టెంపుల్ రన్ వంటి జనాదరణ పొందిన గేమ్స్ చాల కష్టంగా  అమలు చేస్తాయి మరియు మల్టి-టాస్క్ నిర్వహించలేవు.

3జీబీ లేదా 4జీబీ  ర్యామ్

3 – 4జీబీ తో కూడిన స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా అవగాహన ఉన్న వినియోగదారులు కోసం గొప్ప ఉంటాయి. చాల ఫోటోలు తీయడానికి మరియు వారి ఫోన్లలో వీడియో కంటెంట్ ని పుష్కలంగా వాడుకోవచ్చు. ఇంకా మీరు ఈ స్మార్ట్ ఫోన్లలో గేమింగ్ కూడా సాధారణంగా చేయగలరు, దీనికి ప్రాసెసర్ అనుమతిస్తుంది. 3 నుండి 4జీబీ  ర్యామ్ తో ఫోన్లు మల్టీ-టాస్కింగ్ కూడా సులభంగా నిర్వహించగలరు. అనగా, మీరు డజనుకు పైగా బ్రౌజర్ ట్యాబ్లు మరియు మీ ఇ-మెయిల్ మరియు మెసేజింగ్  యాప్స్ వంటివి ఒకేసారి చక్కగా నిర్వహించవచ్చు.

6జీబీ ర్యామ్

ఇది పవర్-యూజర్ కోసం, పనితీరులో కొద్దిగ కూడా ఆలస్యం లేనటువంటి మరియు ఫుల్ వేగం అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ 6జీబీ ర్యామ్ తో ఫోన్లు  పనితీరు పరంగా పైభాగంలో ఉంటాయి. హెవీ-డ్యూటీ గేమింగ్ కి అనువైనది లేదా బ్రౌజింగ్, ఫోటో ఎడిటింగ్, వీడియో ప్లేబ్యాక్ మొదలైనవి ఒకే సమయంలో ఒకేసారి బహుళ అనువర్తనాలను(మల్టి యాప్స్) అమలు చేయడానికి కూడా వీలుంటుంది.

8GB ర్యామ్

ప్రస్తుతం చాలానే స్మార్ట్ ఫోన్లు 8 జీబీ ర్యామ్ తో వచ్చాయి మరియు రాబోతున్నాయి. ఈ ఫోన్ హెవీ గేమింగ్ మల్టి టాస్కింగ్ మరియు సూపర్ స్పీడ్ తో పనిచేస్తుంది. కాబట్టి, స్మార్ట్ ఫోన్ పైన ఆధారపడి ఎక్కువగా తమ పనులను చేసేవారికి, PUBG, Aspalt 9, మరియు Call Of Duty వంటి హై ఎండ్ గేమ్స్ ఆడేవారికి సరిపోతుంది. ఇది ఎటువంటి ఆలస్యం లేకుండా అన్ని అప్స్ ని నిర్వహిస్తుంది.        

12GB ర్యామ్

ప్రస్తుతం అందుబాటులోవున్న ఏ అప్లికేషన్లు కూడా దీని పూర్తి పనిని ఉపయోగించలేకపోతున్నాయి. ఈ సమయంలో, 12GB RAM అసలు ప్రయోజనం కంటే ఇంకా ఎక్కువ అవుంతుంది. అయితే, అది భవిష్యత్తులో రానున్నవాటికీ  మీ ఫోన్ సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తుంది. దీనితో మీకు వేగవంతమైన గేమింగ్, మల్టి టాస్కింగ్, ఫొటో ఎడిటింగ్ ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని పనులను సునాయాసంగా నిర్వహిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo