మీ షోషల్ మీడియా అకౌంట్స్ జర భద్రం..ఈ టిప్స్ మీకోసమే.!

మీ షోషల్ మీడియా అకౌంట్స్ జర భద్రం..ఈ టిప్స్ మీకోసమే.!
HIGHLIGHTS

షోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి

మీ సోషల్ మీడియా అకౌంట్ ప్రైవసీని మరింత పటిష్టంగా ఉంచుకోండి

కొన్ని చిట్కాలను ఈరోజు మీకోసం ఇక్కడ అందిస్తున్నాను

షోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే, మీ సోషల్ మీడియా అకౌంట్ ప్రైవసీని మరింత పటిష్టంగా ఉంచేందుకు కొన్ని జాగ్రత్తలలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే, హ్యాకర్లు ఎప్పటికప్పుడు ఉపయోగిస్తున్న కొత్త పద్ధతులు మరియు మార్గాలను ఉపయోగిస్తారు. అందుకే, ఇటివంటి మోసాల నుండి షోషల్ మీడియా నుండి జరుగనున్న మోసాల భారిన ప్రజలు పడకుండా ఏవిధంగా సురక్షితంగా ఉండేలా చూసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా అందించిన కొన్ని చిట్కాలను ఈరోజు మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

ప్రైవసీ సెట్టింగ్స్

మీ షీషాల్ మీడియా అకౌంట్స్ యొక్క ప్రైవసీ సెట్టింగ్స్ గురించి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. మీ ప్రొఫైల్ ప్రైవసీ సెట్టింగ్స్ ను వీలైనంత వరకూ పరిమితం చేయండి. తద్వారా, మీ అకౌంట్ సురక్షితంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.     

అపరిచితుల నుండి రిక్వెస్ట్ స్వీకరించవద్దు

షోషల్ మీడియాలో ఎక్కువగా హ్యాకర్లు మోసం చెయ్యడానికి ఎంచుకునే మార్గం ఇదే. అందుకే, అపరిచితుల నుండి రిక్వెస్ట్ స్వీకరించవద్దు. అలాగే, మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ మీకు తెలియక పోయినట్లయితే వారి రిక్వెస్ట్ లను కూడా స్వీకరించిక పోవడం మంచిది. ఎందుకంటే, మోసం చేసేందుకు కొందరు వ్యక్తులు నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు.

పబ్లిక్ సెర్చ్ నుండి మీ ప్రొఫైల్ బ్లాక్ చేయండి

Facebook వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ లో మీకు ఈ అప్షన్ అందుబాటులో ఉంది. ఈ అప్షన్ మీ ప్రొఫైల్ సురక్షితంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. ఈ అప్షన్ తో మీ ప్రొఫైల్ ను మీ ఫ్రెండ్ లిస్ట్ లో వున్న వారు లేదా మీరు యాక్సెస్ ఇచ్చిన వారు మాత్రమే మీ ప్రొఫైల్ చూడగలరు.

లాగ్ అవుట్

మీరు మీ Facebook, Instagram, మరియు Twitter వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ లను ఉపయోగించిన ప్రతిసారి కూడా మీ అవసరం అయిపోయిన తరువాత లాగ్ అవుట్ చేయడం మంచిది. ఇలా చేయడం అనేది మీ అకౌంట్ పైన హ్యాకింగ్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గింస్తుంది. ముఖ్యంగా, మీరు వేరొక డివైజ్ లో  మీ ఖాతాకు లాగిన్ చేసిన ప్రతిసారీ లాగ్ అవుట్ చేయడం ఎల్లప్పుడూ సురక్షితం.

ఇక ఇప్పుడు మనం మాట్లడుకోబోయే చివరి విషయం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం, అత్యధికంగా హ్యాకర్లు ఉపయోగిస్తున్న మార్గం కూడా ఇదే.

మోసపూరితమైన లింక్స్ పైన క్లిక్ చేయవద్దు

షోషల్ మీడియా వేదికగా హ్యాకర్లు వల విసిరేది ఈ పద్దతిలోనే. నమ్మశక్యం ఆఫర్లు, ప్రోడక్ట్స్ లేదా మరింకేదైనా విషయంతో లింక్స్ షేర్ చేస్తారు. వీటి పైన మీరు క్లిక్ చేసిన వెంటనే వేట మొదలవుతుంది. అందుకే, సోషల్ మీడియాలో మీరు ఏదైనా విచిత్రమైన క్లెయిమ్‌లు చేసే లింక్స్ ని చూసినట్లయితే, దానిపై క్లిక్ చేయవద్దు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo