ఇలా మీ మొబైల్ 4G ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగం చేసుకోవచ్చు

ఇలా మీ మొబైల్ 4G ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగం చేసుకోవచ్చు
HIGHLIGHTS

అన్ని అవసరాలకు వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం అవుతుంది

మీ ఫోన్ ఇంటర్నెట్ సరైన ఇంటర్నెట్ స్పీడ్ మీకు అందించలేక పోవచ్చు

మీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచేందుకు అనువైన 5 బెస్ట్ టిప్స్

ప్రస్తుతం పనులన్నీ ఆన్లైన్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసులు కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ లేదా ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని అవసరాలకు వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం అవుతుంది. అయితే, ఒక్కొక్కసారి మీ ఫోన్ ఇంటర్నెట్ సరైన ఇంటర్నెట్ స్పీడ్ మీకు అందించలేక పోవచ్చు. అటువంటి సమయంలో మీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచేందుకు అనువైన 5 బెస్ట్ టిప్స్ ఈరోజు అందిస్తున్నాను. ఇక్కడ అందించిన ఈ టిప్స్ పాటిస్తే మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా పెరుగుతుంది.

1. ఫోన్‌ను Re-Start చెయ్యండి

ఇది మొదటి మరియు సులభమైన మార్గం. మీ ఫోన్‌ను పునఃప్రారంభించిన (Re-Start) తరువాత, మొబైల్ నెట్‌వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, మొబైల్ ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ మార్గంతో పాటు మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి పునఃప్రారంభించవచ్చు.

2. ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయండి

మొబైల్‌ను పునఃప్రారంభించడంతో పాటు, మీరు మీ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ విధానంలో కూడా మీ ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్‌వర్క్‌ను Search చేస్తుంది కాబట్టి, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలాసార్లు పెంచుతుంది.

3. డేటా వినియోగాన్ని తనిఖీ చేయండి

చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్ యొక్క డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా  తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది.

4. ఆటో డౌన్‌లోడ్ Update నిలిపివేయండి

సాధారణంగా యాప్స్ ను అప్డేట్ చేయ్యుడానికి  ఫోన్‌లో ఆటో డౌన్‌లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయగలిగితే బాగుంటుంది. ఈ విధానంలో మీకు పరిమిత ఇంటర్నెట్ వినియోగం ఉంటుంది మరియు దీని తరువాత మీకు మంచి వేగం లభిస్తుంది.

5. ఫోన్ యొక్క నెట్‌వర్క్ సెట్టింగ్‌లను Reset చేయండి

మీ ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి Reset చేయడం మంచిది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo