మీ స్మార్ట్ ఫోన్ చాలా లేటెస్ట్ ఫీచర్స్ మరియు చాలా వేగవంతమైన లేటెస్ట్ ప్రొసెసర్ కలిగి ఉన్నా కూడా ఇంటర్నెట్ వేగం మాత్రం చాలా నెమ్మదిగా ఉందా? యూట్యూబ్ వీడియో లేదా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసేప్పుడు తగినంత వేగం ఇవ్వడం లేదా?. కారణం ఏదైనా మీకు మాత్రం చాలా అసహనాన్ని కలిగించవచ్చు. అయితే, ఈ రోజు ఇక్కడ అందించిన చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీ ఫోన్ 4G ఇంటర్నెట్ స్పీడ్ ను వేగంగా మార్చుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్ లో బడ్జెట్ ధరలో కూడా చాలా మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు మంచి క్లారిటీతో వీడియో ప్లే చెయ్యగల సామర్ధ్యం ఉన్నాకూడా ఇంటర్నెట్ వేగం కారణంగా పూర్తిస్థాయి క్లారిటితో కంటెంట్ ని ఆస్వాదించ లేకపోవచ్చు. అయితే, ఈ చిన్న టిప్స్ తో మీ స్మార్ట్ ఫోన్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగంగా మార్చవచ్చు. దీనితో, మీ వీడియో కంటెంట్ క్లారిటీ పాటుగా మీ పనులన్నింటిని చాలా వేగంగా చేసుకోవచ్చు. అంతేకాదు, ఆన్లైన్ క్లాస్ లను కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అటెండ్ చెయ్యవచ్చు.
ఉదాహరణకు, నెట్ ఆప్టిమైజర్ మరియు బూస్టర్ అప్లికేషన్ లను చూడవచ్చు. ఇవి కేవలం DNS సర్వర్లు మరియు వీటితో ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం సాధ్యపడుతుంది. ఇక రెండవ అప్షన్ ఫోన్ సెట్టింగ్స్ లో వున్న ఫైండ్ ది ఆటో స్టార్ట్ అప్షన్. మీ ఫోన్ లో మీకు అవసరం లేని అప్లికేషన్స్ ని Off చెయ్యడం. ఇంటర్నెట్ స్లో అవ్వడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది.
మీ ఫోన్ లో *#*#4636#*#* అని టైప్ చెయ్యండి. వేంటనే, ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫోన్ ఇన్ఫర్మేషన్ మరియు WiFi వివరాలను చూడవచ్చు. ఇక్కడ మీ సర్వీస్ ప్రొవైడర్ ని ఎంచుకోవడం ద్వారా వివరాలు చూడవచ్చు. SIM ని ని ఎంచుకోవడం తో మీకు మరొక విండో ఓపెన్ 'అవుతుంది. ఇక్కడ RunPin Test ని ఎంచుకోండి. తరువాత, క్రింద భాగంలో కనిపించే Refresh అప్షన్ పైన క్లిక్ చెయ్యండి. దీని ద్వారా మీ ఇంటర్నెట్ స్పీడ్ ను కంట్రోల్ చెయ్యవచ్చు.