e-Ration Card PDF ఎలా డౌన్‌ లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకోండి.!

HIGHLIGHTS

రేషన్ కార్డు అనేది ప్రతి కుటుంబానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి

ప్రస్తుతం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా e-Ration Card సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి

రేషన్ కార్డును ఆన్‌ లైన్‌ లో PDF రూపంలో డౌన్‌ లోడ్ చేసుకునే అవకాశం లభించింది

రేషన్ కార్డు అనేది ప్రతి కుటుంబానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి. బియ్యం, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు పొందడానికి రేషన్ కార్డు అవసరం. ప్రస్తుతం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా e-Ration Card సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ కొత్త సదుపాయమతో పౌరులు తమ రేషన్ కార్డును ఆన్‌ లైన్‌ లో PDF రూపంలో డౌన్‌ లోడ్ చేసుకునే అవకాశం లభించింది.

e-Ration Card అంటే ఏమిటి?

e- రేషన్ కార్డ్ అనేది రెగ్యులర్ ఫిజికల్ రేషన్ కార్డు యొక్క డిజిటల్ వెర్షన్. ఇది PDF రూపంలో అందుబాటులో ఉంటుంది. అవసరమైనప్పుడు మొబైల్ లేదా కంప్యూటర్‌ లో కూడా చూపించవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

e-Ration Card డౌన్‌ లోడ్ కోసం ఏమి అవసరం?

రేషన్ కార్డు డౌన్ లోడ్ చేయడానికి కొన్ని వివరాలు అవసరం అవుతాయి. దీనికోసం రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ అవసరం అవుతాయి.

డౌన్‌లోడ్ చేసే విధానం (స్టెప్ బై స్టెప్)

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ (Civil Supplies Department) అధికారిక వెబ్‌ సైట్‌ ను సందర్శించండి. ఇందులో హోమ్‌పేజీలో ఉన్న రేషన్ కార్డ్ సర్వీసెస్ లేదా ఈ రేషన్ కార్డ్ లేదా డౌన్,లోడ్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్‌ పై క్లిక్ చేయండి. ఇందులో, మీ రేషన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ పూర్తి వివరాలు అందించిన తర్వాత సబ్ మీట్ బటన్ పై క్లిక్ చేయండి.

మీకు ఇప్పుడు నమోదిత మొబైల్ నంబర్‌ కు OTP వస్తుంది. ఈ OTP ను నమోదు చేసి ధృవీకరించండి. ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ ఈ రేషన్ కార్డ్ స్క్రీన్‌ పై కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే Download PDF బటన్‌ పై క్లిక్ చేసి ఫైల్‌ ను సేవ్ చేసుకోండి.

Also Read: వైర్లెస్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ కేవలం 16 వేల ఆఫర్ ధరలో అందుకోండి.!

డౌన్‌లోడ్ లో సమస్యలు వస్తే ఏమి చేయాలి?

  • రేషన్ కార్డు నెంబర్ సరిగ్గా నమోదు చేశారో లేదో తనిఖీ చేయండి
  • నమోదిత మొబైల్ నంబర్ యాక్టివ్‌ గా ఉందో లేదో చూడండి
  • వెబ్‌ సైట్ సర్వర్ సమస్యలు ఉంటే కొంతసేపటి తర్వాత మళ్ళీ తిరిగి ప్రయత్నించండి
  • సమీప Mee Seva, CSC లేదా గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి

డిజిటల్ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రేషన్ కార్డ్ PDF డౌన్‌ లోడ్ చేసుకోవడం చాలా సులభమైంది. కొన్ని నిమిషాల్లోనే ఇంట్లో నుంచే మీ రేషన్ కార్డు కాపీని మీరే సొంతంగా పొందవచ్చు. పై సూచనలను అనుసరించి మీ రేషన్ కార్డు కాపీని సురక్షితంగా డౌన్‌ లోడ్ చేసుకోండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :