మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ డబుల్ చెయ్యాలా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Jan 2021
HIGHLIGHTS
  • రోజు రోజుకు ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతోంది

  • ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటేనే ఈ పనులను చక్కబెట్టవచ్చు

  • 5 సింపుల్ ట్రిక్స్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ ను డబుల్ చెయ్యవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ డబుల్ చెయ్యాలా?
మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ డబుల్ చెయ్యాలా?

రోజు రోజుకు ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతోంది మరియు మన డేటా అవసరాలు కూడా మరింతగా పెరుగ్గుతున్నాయి. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా ఆఫీస్ పనులు, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులు వంటి చాలా ముఖ్యమైన పనులకు ఈరోజుల్లో ఇంటర్నెట్ అవసరం ఎంతగానో వుంది. అయితే, ఈ ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటేనే ఈ పనులను చక్కబెట్టవచ్చు. ఒక్కొక్కసారి, మీ స్మార్ట్ ఫోన్ 4G శక్తితో వున్నా కూడా ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం నెమ్మదిగా వుంటుంది. అయితే, ఈ క్రింద తెలిపిన 5 సింపుల్ ట్రిక్స్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ ను డబుల్ చెయ్యవచ్చు.       

మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని ఎలా పెంచాలి?

1. ఫోన్ ‌ను Restart చెయ్యడం

ఇది మొదటి మరియు సులభమైన మార్గం. ఫోన్ ‌నుRestart చేసిన తరువాత, మొబైల్ నెట్ ‌వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ పద్దితిలో మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి తిరిగి ప్రారంభించవచ్చు.

2. ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ‌ను ఆన్ చేయండి

మొబైల్‌ను Restart చేయడంతో పాటు, మీరు ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్‌ ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ తరువాత, ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్ ‌వర్క్‌ ను సెర్చ్ చేస్తుంది, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలా సార్లు పెంచుతుంది.

3. డేటా వినియోగాన్ని చెక్ చేయండి

చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్స్ డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకేసారి పరిశీలించాలి.

4. ఆటో డౌన్‌ లోడ్ అప్డేట్స్ నిలిపివేయండి

సాధారణంగా యాప్స్ అప్డేట్ చేయడానికి ఫోన్ ‌లో ఆటో డౌన్ ‌లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయగలిగితే బాగుంటుంది. ఈ విధంగా మీ ఇంటర్నెట్ పరిమితంగా ఉపయోగించబడుతుంది మరియు మీకు మంచి వేగం లభిస్తుంది.

5. ఫోన్ యొక్క నెట్ ‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేయండి

ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్‌ వర్క్ సెట్టింగ్‌లను ఒకసారి రీసెట్ చేయడం మంచిది.

logo
Raja Pullagura

email

Web Title: How to double internet speed in your mobile?
DMCA.com Protection Status