Grok AI అండ్ ఉచిత AI టూల్స్ సాయంతో YouTube వీడియోలు ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకోండి.!
యూట్యూబ్ తో డబ్బు సంపాదించడం చాలా సులభం
ఎడిటింగ్ చేయడం వంటి పనులకు సమయం కేటాయించలేక పోతుంటారు
Grok AI ఉపయోగించి YouTube Shorts తయారు చేసుకోవచ్చు
యూట్యూబ్ తో డబ్బు సంపాదించడం చాలా సులభం అని అందరూ యూట్యూబ్ లో ఛానల్ పెట్టి నాలుగు వీడియోలు అప్‌లోడ్ చేయగానే టాపిక్ తెలియక ఆగిపోతారు. యూట్యూబ్ ఛానెల్ గురించి చాలా మందికి ఆసక్తి ఉన్నప్పటికీ వీడియోలు తయారు చేయడం, స్క్రిప్ట్ రాయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం వంటి పనులకు సమయం కేటాయించలేక పోతుంటారు. అయితే, ఇప్పుడు Grok AI తో పాటు కొన్ని ఉచిత AI టూల్స్ ఉపయోగించి ఈ పనులు అన్ని చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రత్యేకంగా ఫేస్ చూపించకుండా YouTube Shorts, టెక్ వీడియోలు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ తయారు చేయాలనుకునే వారికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.
Grok AI సాయంతో YouTube వీడియోలు
మీ యూట్యూబ్ ఛానల్ తో మీరు కూడా సింపుల్ గా మంచి వీడియోలు క్రియేట్ చేయడానికి కొన్ని చిన్న పనులు చేయాల్సి ఉంటుంది. అయితే, మీకు రిజల్ట్స్ మాత్రం గొప్పగా వస్తాయి. దీనికోసం మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ వివరంగా అందించాము.
Grok AI తో వీడియో స్క్రిప్ట్ తయారీ
ఫస్ట్ స్టెప్ లో మీరు మీ వీడియో కోసం స్క్రిప్ రాయాలి. దానికోసం, ముందుగా గ్రోక్ AI వెబ్ సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి. మీకు కావాల్సిన వీడియో టాపిక్ ఇచ్చి 60 సెకన్ల YouTube Shorts స్క్రిప్ట్ తయారు చేయమని అడగాలి. వీడియో ప్రారంభంలో ఆకట్టుకునే హుక్, మధ్యలో ముఖ్యమైన సమాచారం, చివర్లో ఆసక్తికరమైన ముగింపు ఉండాలి అని సూచన ఇవ్వండి. అవసరమైతే టైటిల్, డిస్క్రిప్షన్ కూడా తయారు చేసుకోవచ్చు.
AI వాయిస్ ఓవర్ తయారీ
రెండో స్టెప్ లో భాగంగా మీ వీడియో కోసం అవసరమైన వాయిస్ ని రెడీ చేసుకోవాలి. దీనికోసం, మీరు సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ను Eleven Labs ఉచిత ప్లాన్ లేదా అందుబాటులో ఉన్న ఇతర టెక్స్ట్ టు స్పీచ్ టూల్స్ ఉపయోగించి వాయిస్ గా మార్చుకోవాలి. తెలుగు భాషకు సరైన ఉచ్చారణ వచ్చే వాయిస్ ను ఎంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి.
వీడియో విజువల్స్ సృష్టించడం
మూడు స్టెప్ లో మీ స్క్రిప్ట్ కోసం తగిన వీడియో విజువల్స్ సృష్టించడం. దీనికోసం, Canva లేదా Microsoft Designer వంటి టూల్స్ తో వీడియోకు అవసరమైన చిత్రాలు, గ్రాఫిక్స్ తయారు చేసుకోవచ్చు. వీటిలో AI వీడియోస్ ఫీచర్లు కనుక మీకు అందుబాటులో ఉంటే చిన్న వీడియో క్లిప్స్ కూడా మీరు క్రియేట్ చేయవచ్చు.
వీడియో ఎడిటింగ్
ఇక చివరి స్టెప్ లో మీరు రెడీ చేసుకున్న అన్ని వివరాలు జోడించి వీడియో క్లిప్ ను రెడీ చేసుకోవడం. దీనికోసం, CapCut లేదా Canva ఉపయోగించి మీరు తయారు చేసుకున్న వాయిస్ ఓవర్, చిత్రాలు, వీడియో క్లిప్స్ మరియు సబ్ టైటిల్స్ కలిపి వీడియో రూపొందించవచ్చు. ఒకవేళ మీరు YouTube Shorts కోసం వీడియో కోరుకుంటే 9:16 ఫార్మాట్ ఎంచుకోవాలి.
YouTube లో వీడియో అప్‌లోడ్
మీరు రెడీ చేసుకున్న వీడియోకు ఆకర్షణీయమైన థంబ్ నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్, సంబంధిత కీ వర్డ్స్ జోడించి YouTube Studio ద్వారా అప్‌లోడ్ చేయాలి.