how to check Talliki Vandanam status in online with aadhaar number
Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు రెండో విడత తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్స్ లో ఈరోజు డబ్బులు పడతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే, మీ అకౌంట్లో డబ్బులు పడతాయో లేదో అని కొంత మందికి అనుమానాలు రేకెత్తుతున్నాయి. మీకు కూడా ఇలాంటి డౌట్ వుంటే, ఆధార్ నెంబర్ తో డబ్బులు వచ్చేది లేనిది ఆన్లైన్ లో చెక్ చేసుకోండి.
తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల చదువు కోసం చేయూత అందిస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం రూ. 15,000 రూపాయల మొత్తాన్ని విద్యార్థులకు అందిచేస్తుంది. అయితే, ఇందులో రూ. 2,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రయోజనార్థం వినియోగించడానికి ప్రభుత్వం కేటాయిస్తుంది. మిగిలిన రూ. 13,000 రూపాయల మొత్తాన్ని తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తుంది. ఈ అమౌంట్ యూ ఈరోజు జమ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది.
మీ అమౌంట్ మీ అకౌంట్ లో వసుందో లేదో ముందుగా చెక్ చేయాలనుకుంటే జస్ట్ మీ ఆధార్ నెంబర్ తో సింపుల్ గా తెలుసుకోవచ్చు. దీనికోసం, ముందుగా bm-sgsw.ap.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. తర్వాత మీకు “Scheme Eligibility Check’ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సూచించిన వద్ద మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి. అలాగే, స్కీమ్ టైప్ లో “తల్లికి వందనం” ఎంచుకోండి. తర్వాత అకడమిక్ ఇయర్ లో 2026–27 ను ఎంచుకోండి.
తర్వాత, చివరిలో ఉన్న ‘Get Details’ పై నొక్కండి. మీకు మీ ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ కి OTP అందిస్తుంది. ఇక్కడ బాక్స్ లో OTP మరియు క్రింద ఉండే Captcha ని బాక్స్ లో నమోదు చేసి సబ్మిట్ చేయండి. మీకు మీ వివరాలు మరియు మీ పిల్లల వివరాలతో పేరు మీ ఎలిజిబిలిటీ కూడా కనిపిస్తుంది.
ఇక్కడ మీరు ఈ పథకానికి అర్హులు అని ఉంటే, మీకు మీ అకౌంట్ లో డబ్బులు జమ చేయబడతాయి. అయితే, రిలీజ్ చేసిన తర్వాత మీ అకౌంట్ లో డిపాజిట్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ అమౌంట్ గురించి మీ ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ కి మెసేజ్ కూడా అందుతుంది, లేదనుకుంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేయడం ద్వారా కూడా మీకు వచ్చిన అమౌంట్ ను చెక్ చేసుకోవచ్చు.
Also Read: Vivo T5 Lite Sale: భారీ సింగిల్ డే ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ .. ఛాన్స్ ఈరోజు మాత్రమే.!
2026-27 సంవత్సరానికి గాను దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు చెబుతున్నారు. ఈ పథకానికి అర్హత సాధించిన వారి కోసం దాదాపు రూ. 10,120 కోట్లకు పైగా నిధులు కేటాయించారు.