మీ పేరు మీద SIM కార్డ్స్ ఎన్ని ఉన్నాయో సింపుల్ గా తెలుసుకోండి.!

మీ పేరు మీద SIM కార్డ్స్ ఎన్ని ఉన్నాయో సింపుల్ గా తెలుసుకోండి.!
HIGHLIGHTS

మీ పేరు మీద SIM కార్డ్స్ ఎన్ని ఉన్నాయో సింపుల్ గా తెలుసుకోండి

న్ని మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నయో అనే వివరాలను కూడా తెలుసుకోవచ్చు

మీరు తీసుకున్న మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు

మీ పేరు మీద SIM కార్డ్స్ ఎన్ని ఉన్నాయో సింపుల్ గా తెలుసుకోండి. అంటే, మొదటి నుండి ఇప్పటి వరకూ మీ పేరు మీద మీరు తీసుకున్న అన్ని మొబైల్ వివరాలను చాలా ఈజీగా తెలుసుకోవచ్చన్న మాట. ఆన్లైన్లో చాలా సులభంగా మీరు పేరు మీద తీసుకున్న మొబైల్ నంబర్ లు ఎన్ని మరియు ప్రస్తుతం ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నయో అనే వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

టెలికం యూజర్లు తీసుకున్న అన్ని మొబైల్ నంబర్ వివరాలను మరియు వాటి యాక్టివ్ స్టేటస్ ను పారదర్శకంగా ఉంచడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఇటీవల తీసుకొచ్చిన కొత్త వెబ్సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవడం సులభతరమయ్యింది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు తీసుకున్న మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు.

మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం  సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo