ఇక మీ ఫోన్ తోనే మీ ఆధార్ సరిచేసుకోవచ్చు..!…కానీ ఈ అప్డేట్స్ మాత్రమే..!

ఇక మీ ఫోన్ తోనే మీ ఆధార్ సరిచేసుకోవచ్చు..!…కానీ ఈ అప్డేట్స్ మాత్రమే..!
HIGHLIGHTS

అందరికి అవసరమయ్యే అతి ముఖ్యమైన ప్రూఫ్ ఆధార్ కార్డ్

ధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ లేదా మార్చుకోవచ్చు

ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది

అందరికి అవసరమయ్యే అతి ముఖ్యమైన ప్రూఫ్ ఆధార్ కార్డ్. అయితే, ఆధార్ లో ఏదైనా మార్పులు చేయాల్సివస్తే మాత్రం ఆధార్ కేంద్రాలకి పరుగులు తియ్యవలసి వస్తుంది. అంటే, ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే చాలా తతంగం ఉంటుంది. కానీ ఇది కేవలం మీ పేరు ,వయసు లేదా ఇతర వివరాల అప్డేట్ చెయ్యాలనుకుంటే మాత్రమే. మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ లేదా మార్చుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది.

ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:

ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి

ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది

దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు

ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి

మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది

మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది

ఇక్కడ  Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి

ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి

తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు

OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి

అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo